ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్లు | SBI credit card bumper Diwali offers | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్లు

Oct 9 2019 8:22 AM | Updated on Oct 9 2019 8:27 AM

 SBI credit card bumper Diwali offers - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కూడా ఆఫర్ల యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చింది. దీపావళి సందర్భంగా  వినియోగదారులను ఆకట్టుకునేందుకు పండగ ఆఫర్ ప్రకటించింది.  తనక్రెడిట్ కార్డు వినియోగదారులు ఈ పండుగ సీజన్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఎస్‌బీఐ వివిధ రకాల పెద్ద బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీపావళి బంపర్ ఆఫర్ 30 అక్టోబర్ 2019 వరకు చెల్లుతుంది.

ముఖ్యంగా  ఎస్‌బీఐ ఇండియా కా దీపావళి ఆఫర్ కింద  రూ.లక్ష విలువైన మేక్ మై ట్రిప్ యాప్ హాలిడే వోచర్‌ను గెలుచుకోవచ్చు.  కార్డుపై ఎక్కువ మొత్తం ఖర్చుపెట్టిన టాప్‌ వినియోగదారులకు ఈ అద్భుత అవకాశం దక్కనుంది. అలాగే మరికొంతమందికి  షావోమి స్మార్ట్‌ఫోన్లను ఉచితంగా అందిస్తుంది. ఇంకా ఇతర  స్మార్ట్ డివైజ్‌లను కూడా సొంతం  చేసుకోవచ్చు. దీంతో పాటు మెగా ప్రైజ్, వీక్లి ప్రైజ్, డైలీ ప్రైజ్, అవర్లీ ప్రైజ్‌లు కూడా ఉన్నాయి. 

ఎస్‌బీఐ అందిస్తున్న ఆఫర్లు
అవర్లీ ప్రైజ్ కింద రూ.1000 విలువ చేసే ప్యూమా   గిఫ్ట్ వోచర్ 
డైలీ ప్రైజ్ కేటగిరీలో రూ.7000 వైర్‌లెస్ హెడ్ ఫోన్స్
వీక్లీ కేటగిరీలో రూ. 17,499ల ఎంఐ ఏ3 ఫోన్ 

కాగా ఎస్‌బీఐ  ఇటీవల ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement