నెలకు 3 లక్షల కార్డులు క్రెడిట్‌ కార్డ్స్‌: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ | HDFC Bank aims to regain lost ground in credit card battle | Sakshi
Sakshi News home page

నెలకు 3 లక్షల కార్డులు క్రెడిట్‌ కార్డ్స్‌: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Published Tue, Aug 24 2021 5:56 AM | Last Updated on Tue, Aug 24 2021 3:53 PM

HDFC Bank aims to regain lost ground in credit card battle - Sakshi

ముంబై: క్రెడిట్‌ కార్డ్స్‌ మార్కెట్లో తిరిగి పుంజుకుంటామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. కొత్త క్రెడిట్‌ కార్డుల జారీకి ఆర్‌బీఐ నుంచి గత వారం గ్రీన్‌సిగ్నల్‌ పొందిన నేపథ్యంలో భారీ లక్ష్యాన్ని బ్యాంక్‌ నిర్ధేశించుకుంది. తొలుత నెలకు 3 లక్షల కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు బ్యాంక్‌ పేమెంట్స్, కంజ్యూమర్‌ ఫైనాన్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ పరాగ్‌ రావ్‌ వెల్లడించారు.

‘మూడు నెలల్లో ఈ సంఖ్యను చేరుకుంటాం. ఆ తర్వాత ఆరు నెలలకు ఈ సంఖ్యను 5 లక్షలకు చేరుస్తాం. 9–12 నెలల్లో కార్డుల సంఖ్య పరంగా మా వాటాను తిరిగి చేజిక్కించుకుంటాం’ అని వివరించారు. కార్డుల సంఖ్య పరంగా హెచ్‌డీఎఫ్‌సీ వాటా 2 శాతం తగ్గి 25లోపుకు వచ్చింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నూతన క్రెడిట్‌ కార్డులు జారీ చేయరాదంటూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను 2020 నవంబరులో ఆర్‌బీఐ ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement