సాక్షి,ముంబై: ఆన్‌లైన్ షాపింగ్ సౌలభ్యం కోసం ఆర్బీఐ‘టోకనైజేషన్’ అనే కొత్త పద్దతిని ప్రవేశపెట్టింది. అలాగే చాలా సురకక్షితంగా కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేసుకోవచ్చని కేంద్ర బ్యాంకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్,ఆఫ్‌సేల్ యాప్‌లో లావాదేవీలలో ఉపయోగించిన మొత్తం క్రెడిట్, డెబిట్ కార్డ్ డేటాను సెప్టెంబర్ 30, 2022 నాటికి ప్రత్యేక టోకెన్‌లతో భర్తీ చేయాలని ఆదేశించింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జూలై 1 నుండి 'క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్' మార్గదర‍్శకాలను అమలు చేయాల్సవ ఉంది. అయితే, పరిశ్రమ వాటాదారుల విజ్ఞప్తి మేరకు ఈ గడువును అక్టోబరు 1కి పెంచింది.
కస్టమర్‌లు సురక్షితమైన లావాదేవీలు చేయడంలో సహాయపడతాయని, కార్డ్ వివరాలు ఎన్‌క్రిప్టెడ్ “టోకెన్”గా స్టోర్ అవుతాయని తెలిపింది. ఒరిజినల్ కార్డ్ డేటాను ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ టోకెన్‌తో భర్తీ చేయడం తప్పనిసరి చేసింది. ఈ టోకెన్లు కస్టమర్ వివరాలను బహిర్గతం చేయకుండా చెల్లింపు చేయడానికి అనుమతిస్తాయి. ఫలితంగా కార్డ్ హోల్డర్ల ఆన్‌లైన్ లావాదేవీల అనుభవాలను మెరుగుపరుస్తుంది. సైబర్ నేరగాళ్లనుంచి కార్డ్ సమాచారాన్ని భద్ర పరుస్తుంది.
కార్డులు లేకుండానే ఆన్ లైన్ లో షాపింగ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ షాపింగ్ లో దిగ్గజాలైన అమెజాన్, ప్లిఫ్ కార్ట్, బిగ్ బాస్కెట్..ఇతరత్రా ఆన్ లైన్ వెబ్ సైట్ లలో షాపింగ్ మరింత సులభతరం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. అందుకనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా 2022, జనవరి నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్ లైన్ షాపింగ్ చేసేందుకు కొత్త చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రజల సమాచారం కూడా భద్రంగా వీలు ఉండే అవకాశం ఉందని వెల్లడిస్తోంది.
టోకెన్‌లు ఎలా రూపొందించుకోవాలి
♦ కొనుగోలుకుముందు చెల్లింపు లావాదేవీని ప్రారంభించడానికి, ఇ-కామర్స్ వ్యాపారి వెబ్‌సైట్ లేదా అప్లికేషన్‌కు వెళ్లాలి
♦ ఉత్పత్తులను కొనుగోలు చేసే క్రమంలో..తమ కార్డు పూర్తి సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది.
♦ షాపింగ్ వెబ్ సైట్ కు చెందిన చెక్ అవుట్ పేజీలో కార్డు వివరాలను నమోదు చేయాలి. అనంతరం టోకనైజేషన్ సెలక్ట్ చేసుకోవాలి.
♦ క్రియేట్ టోకెన్‌ను సెలక్ట్ చేసి,అధికారిక మొబైల్ ఫోన్ లేదా ఇమెయిల్‌లో ద్వారా వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. దీంతోటోలావాదేవీ పూర్తి అవుతుంది.
♦ తమకు నచ్చినన్ని కార్డులను టోకనైజ్ చేసుకొనే ఛాన్స్ ఉంది. అదే వెబ్‌సైట్ లేదాయాప్‌లో తదుపరి కొనుగోళ్లకు నాలుగు అంకెల టోకెన్ ఇస్తే సరిపోతుంది.
♦ తద్వారా మోసాలకు తావుండదని, కొనుగోలుదారు సమాచారాన్ని సేకరించడం హ్యాకర్లకు కష్టమవుతుందని ఆర్బీఐ అభిప్రాయం.
♦ దీని ప్రకారం ఇకపై 16 అంకెల కార్డు వివరాలను, కార్డు గడువు తేదీని గుర్తించుకోవాల్సిన అవసరం ఉండదు.
అలాగే కార్డ్ జారీ చేసేవారు క్రెడిట్ కార్డ్‌ను యాక్టివేట్ చేయడానికి కార్డ్ హోల్డర్ నుండి వన్ టైమ్ పాస్‌వర్డ్ ఆధారిత సమ్మతిని తప్పనిసరిగా పొందాలి. ఒకవేళ అది జారీ చేసిన తేదీ నుండి 30 రోజుల కంటే ఎక్కువ కస్టమర్ యాక్టివేట్ చేయపోతే, ఎలాంటి సమ్మతి రాకపోయినా, కన్ఫర్మేషన్ కోరిన తేదీ నుండి ఏడు పని దినాలలోగా, కస్టమర్‌కు ఎటువంటి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ ఖాతా క్లోజ్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment