క్రెడిట్‌ కార్డు వివరాలు అందించి ... | Mumbai woman gives details of her 4 credit cards, colleague’s card, loses Rs 94k | Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ కార్డు వివరాలు అందించి ఘోరంగా బుక్కైంది

Published Thu, Oct 5 2017 10:59 AM | Last Updated on Thu, Oct 5 2017 1:55 PM

Mumbai woman gives details of her 4 credit cards, colleague’s card, loses Rs 94k

ముంబై : బ్యాంకు అధికారాలమంటూ కాల్స్‌ చేసి, వినియోగదారులను ఖాతాల్లో డబ్బును కాజేస్తున్నారు ఘరానా మోసగాళ్లు. ఈ ఘటనలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయే కాని తగ్గడం లేదు. తాజాగా ఓ మల్టినేషనల్‌ కంపెనీలో పనిచేసే హెచ్‌ఆర్‌ ప్రొఫెషనల్‌కు బ్యాంకు అధికారినంటూ కాల్‌ చేసిన మోసగాడు, ఆమె ఖాతాల్లో రూ.94వేలు నొక్కేశాడు. పేబ్యాక్‌ పాయింట్లు రిడీమ్‌ చేసుకోండంటూ ఈ మోసానికి పాల్పడ్డాడు. అది మోసపూరిత కాల్‌ అని గుర్తించలేని ఆమె, తన నాలుగు కార్డుల వివరాలతో పాటు, తన సహచరిణి కార్డు వివరాలు, వన్‌-టైమ్‌ పాస్‌వర్డ్‌ను మోసగాడికి అందించి బుకైంది. తన ఖాతాల్లో డబ్బును కోల్పోయే సరికి షాక్‌కు గురైన ఆ 49 ఏళ్ల మహిళ పోవై పోలీసులను ఆశ్రయించింది. 

ఆ మహిళ అందించిన వివరాల ప్రకారం తను అధేరిలో ఓ మల్టినేషనల్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తుంది. మోసగాడి నుంచి ఓ రోజు ఫోన్‌ కాల్‌ వచ్చింది. తన బ్యాంకు నరిమాన్‌ పాయింట్‌ బ్రాంచు నుంచి కాల్‌ చేసినట్టు చెప్పినట్టు ఆ మహిళ పేర్కొంది. తన క్రెడిట్‌ కార్డులపై ఉన్న పేబ్యాక్‌ పాయింట్లను రిడీమ్‌ చేసుకోవాలంటూ ఆ మోసగాడు పేర్కొన్నాడని తెలిపింది. అనంతరం మొబైల్‌ఫోన్‌కు నగదు డెబిట్‌ అయినట్టు వచ్చిన మెసేజ్‌ చూసి షాక్‌ గురయ్యాయని పేర్కొంది. వంచన, గుర్తింపు దొంగతనం, మోసం కింద ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ కింద గుర్తుతెలియని ఆ మోసగాడిపై పోవై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement