
స్నాప్‌డీల్ చేతికి రూపీపవర్
డిజిటల్ ఫైనాన్షియల్ ఉత్పత్తులందించే రూపీ పవర్ సంస్థలో మెజారిటీ వాటాను ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ ఉత్పత్తులందించే రూపీ పవర్ సంస్థలో మెజారిటీ వాటాను ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ కొనుగోలు చేసింది. నగదు, స్టాక్ డీల్‌తో ఈ వాటాను స్నాప్‌డీల్ కైవసం చేసుకుంది. అయితే ఎంత మొత్తం వెచ్చించిందీ వెల్లడించలేదు. ఈ వాటా కొనుగోలుతో రూ.4,500 కోట్ల ఆన్‌లైన్ ఫైనాన్షియల్ సర్వీసుల మార్కెట్లోకి స్నాప్‌డీల్ ప్రవేశించింది. రుణాలు, క్రెడిట్ కార్డులు ఇతర వ్యక్తిగత ఆర్థిక ఉత్పత్తులకు సంబంధించి డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్‌గా రూపీపవర్ సేవలందిస్తోంది. ప్రస్తుతం 40గా ఉన్న ఉద్యోగుల సంఖ్యను ఏడాదిలో 200కు పెంచుతామని రూపీపవర్ పేర్కొంది.