ఒక వ్యక్తి రుణ అర్హతను నిర్ణయించడంలో క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ కీలకం. సరళంగా చెప్పాలంటే, ఇది రుణగ్రహీత ఆర్థిక ఆరోగ్యం గురించి తెలియజేస్తుంది. బ్యాంకులు, రుణదాతలు ఈ స్కోరును బట్టి కస్టమర్‌కు రుణం, క్రెడిట్ కార్డు లేదా ఇతర సేవలను ఇవ్వవచ్చో లేదో నిర్ణయించడానికి ఉపయోగిస్తారు.
సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోరును మంచిగా పరిగణిస్తారు. ఈ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేటుతో సులభంగా క్రెడిట్ కార్డు లేదా రుణాన్ని పొందవచ్చు. 600 కంటే తక్కువ స్కోరు ఉంటే అప్పు పొందడాన్ని కష్టతరంగా, ఖరీదైనదిగా చేస్తుంది.
రూ.19 లక్షలు అదనంగా చెల్లించాలి..
మీరు రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారనుకుంటే తక్కువ క్రెడిట్ స్కోర్ కారణంగా రూ.19 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదెలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం..
మీకు క్రెడిట్ స్కోర్ 820 అనుకుంటే రూ.50 లక్షల గృహ రుణం 20 ఏళ్ల కాలానికి 8.35 శాతం వడ్డీ రేటుతో పొందొచ్చు. ఈ కాల వ్యవధి పూర్తయ్యేలోపు నెలవారీ ఈఎంఐ రూ.42,918 చొప్పున మీరు తిరిగి చెల్లించే మొత్తం రూ.1.03 కోట్లు (రూ.50 లక్షల అసలు, రూ.53 లక్షల వడ్డీ) అవుతుంది.
అదే మీ క్రెడిట్ స్కోర్ 580 అయితే అదే మొత్తంపై వడ్డీ రేటు 10.75 శాతం వరకు ఉంటుంది. 20 ఏళ్లలో రూ.1.21 కోట్లు (రూ.50 లక్షల అసలు, రూ.71.82 లక్షల వడ్డీ) రుణదాతకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న కారణంగా రూ .18.82 లక్షలు అదనంగా చెల్లించాలి.
మంచి క్రెడిట్ స్కోరు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ ఈఎంఐలు, ఇతర ఆర్థిక బాధ్యతలను సకాలంలో చెల్లించేలా చూసుకోండి. ఆలస్యంగా చెల్లింపులు లేదా డిఫాల్ట్‌లు మీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని (మీరు ఉపయోగిస్తున్న మీ క్రెడిట్ లిమిట్ శాతం) 30 శాతం కంటే తక్కువగా ఉంచుకోండి. అధిక వినియోగం అధిక క్రెడిట్ రిస్క్‌ను సూచిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
మీ క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించుకోండి. తప్పులను వెంటనే సరిదిద్దుకోవడం వల్ల మీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్‌కు అనవసరమైన నష్టాన్ని నివారించవచ్చు.
రుణాలు వంటి క్రెడిట్ కోసం తరచుగా వచ్చే దరఖాస్తులు మీ నివేదికపై అనేక కఠినమైన విచారణలకు దారితీస్తాయి. ఇది మీ స్కోరును తగ్గిస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే కొత్త క్రెడిట్ కోసం దరఖాస్తు చేసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment