ముంబై: ఇప్పటివరకూ వ్యక్తులకు మాత్రమే క్రెడిట్ స్కోరు ఇస్తున్న ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజాగా చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) కూడా ర్యాంకింగ్ వ్యవస్థను ఆవిష్కరించింది. ఆన్‌లైన్ పీఎస్‌బీ లోన్స్‌తో కలిసి ’ఫిట్ ర్యాంక్’ను ప్రవేశపెట్టింది. కరెంటు అకౌంట్లు, ఆదాయపు పన్ను రిటర్నులు, జీఎస్‌టీ రిటర్నుల ఆధారంగా 6 కోట్ల పైచిలుకు ఎంఎస్‌ఎంఈలకు 1–10 స్కోరును ఇవ్వనుంది.
చిన్న వ్యాపారాలకూ రుణ సదుపాయాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, అలాగే ఆర్థిక సంస్థలు మొండిబాకీల వల్ల నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న సంస్థ చెల్లింపు సామర్థ్యాలపై ఆర్థిక సంస్థ ఒక అవగాహనకు వచ్చేందుకు ర్యాంకింగ్ సహాయపడగలదని సిబిల్ ఎండీ రాజేశ్ కుమార్ తెలిపారు. కొత్తగా ఆవిష్కరించిన సాధనాన్ని ఉపయోగించి బ్యాంకులు రూ. 1 కోటి వరకూ రుణాలు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఆయన వివరించారు.
చదవండి: న్యూ ఇయర్ ముందు.. కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ!
Comments
Please login to add a commentAdd a comment