క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (సిబిల్) స్కోరుతో నిమిత్తం లేకుండా రుణాలు మంజూరు చేస్తున్న బ్యాంకు మేనేజర్ల విచక్షణాధికారాలకు రిజర్వు బ్యాంకు అడ్డుకట్ట వేసింది. రూ. 50 వేలకు పైన రుణ మంజూరుకు సంబంధించి తప్పనిసరిగా సిబిల్ స్కోరును పరిగణనలోకి తీసుకోవాలని, కనీసం 700 పైన స్కోరు ఉన్న వారికే రుణాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక సిబిల్ పరిధిలోకి రావాలని అన్ని రకాల సహకార బ్యాంకులకూ సూచించింది. రైతులు తీసుకునే స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాల మంజూరు, చెల్లింపు ప్రక్రియను సిబిల్‌లో నమోదు చేసేలా చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులను ఆదేశించింది.