క్రెడిట్ స్కోర్ అనేది ఆర్థిక ఆరోగ్యానికి కీలకమైన అంశం. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే అధిక రుణాలు వేగంగా పొందవచ్చు. అలాగే అనుకూలమైన వడ్డీ రేట్లు కూడా లభిస్తాయి. అయితే మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడానికి శ్రద్ధ, తెలివైన ఆర్థిక నిర్ణయాలు అవసరం. సాధారణంగా చేసే కొన్ని తప్పుల కారణంగా క్రెడిట్ తగ్గిపోతుంది. క్రెడిట్ స్కోర్‌ను 700 కంటే ఎక్కువగా ఉండాలంటే సరిదిద్దుకోవాల్సిన ఆరు తప్పుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
క్రెడిట్ రిపోర్ట్‌లో లోపాలు
క్రెడిట్ నిర్వహణలో అత్యంత కీలకమైన అంశాలలో ఒకటి క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించడం. ఇందులో ఏవైనా లోపాలుంటే వెంటనే పరిష్కరించుకోవడంలో విఫలమైతే క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకావశం ఉంటుంది.
చెల్లింపులు విస్మరించడం
ఆలస్యంగా చేసిన లేదా విస్మరించిన చెల్లింపులు క్రెడిట్ స్కోర్‌పై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అది క్రెడిట్ కార్డ్ అయినా, తనఖా అయినా లేదా మరేదైనా రుణమైనా, సకాలంలో చెల్లింపులు చాలా కీలకం. గడువు తేదీలు దాటిపోకుండా రిమైండర్‌లు లేదా ఆటోమేటిక్ చెల్లింపులను సెటప్ చేసుకోండి.
హైరిస్క్ లోన్లలో సహ సంతకం చేయడం
తెలిసిన వారి ఎవరైనా రుణాలు తీసుకుంటున్నప్పుడు చాలా మంది సహ సంతకాలు చేస్తుంటారు. ఇది సహాయకమైన చర్యగా అనిపించినా సహ సంతకం చేసిన వ్యక్తి చెల్లింపుల్లో విఫలమైతే అది మీ క్రెడిట్ స్కోర్ నేరుగా ప్రభావితమవుతుంది. సహ సంతకం చేయడానికి ముందు, రుణగ్రహీత ఆర్థిక బాధ్యత, రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పూర్తిగా అంచనా వేయండి.
క్రెడిట్ కార్డ్ పరిమితిని దాటడం
క్రెడిట్ కార్డ్ పరిమితిని దాటడం లేదా అధిక బ్యాలెన్స్‌ని కలిగి ఉండటం మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. బాధ్యతాయుతమైన క్రెడిట్ వినియోగాన్ని ప్రదర్శించడానికి మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లను పరిమితి కంటే తక్కువగా ఉంచడం, ఆదర్శంగా 30% కంటే తక్కువగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకోండి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌కు సానుకూలంగా దోహదపడుతుంది.
ఏకకాలంలో ఎక్కువ దరఖాస్తులు
రుణాలు లేదా క్రెడిట్ కార్డ్‌ల కోసం ఏకకాలంలో ఎక్కువ దరఖాస్తులు చేస్తే రుణదాతలు ఆర్థిక అస్థిరతగా భావించవచ్చు. ప్రతి అప్లికేషన్ కోసం మీ క్రెడిట్ రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గిస్తుంది.
పాత క్రెడిట్ ఖాతాలను మూసివేయడం
పాత క్రెడిట్ ఖాతాలను మూసివేయడం అనేది వివేకవంతమైన చర్యగా అనిపించవచ్చు. అయితే ఇది మీ క్రెడిట్ స్కోర్‌కు హాని కలిగించే అవకాశం ఉంది. ఎక్కువ క్రెడిట్ హిస్టరీ ఉండటం అనేది క్రెడిట్ స్కోర్‌ను లెక్కించడంలో ఒక అంశం. పాత ఖాతాలను మూసివేయడం వల్ల క్రెడిట్ హిస్టరీ తగ్గిపోయే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment