గృహ కొనుగోలుదారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌ | SBI Cuts Home Loan Interest Rates | Sakshi
Sakshi News home page

గృహ కొనుగోలుదారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌

Mar 1 2021 4:18 PM | Updated on Mar 1 2021 5:13 PM

SBI Cuts Home Loan Interest Rates - Sakshi

గృహ రుణం తీసుకోవాలనుకునే వారికి దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) గుడ్‌న్యూస్‌ చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణాలపై వడ్డీ రేటును 10 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. రుణ మొత్తంపై సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా వడ్డీ రేట్లు వర్తిస్తాయని తెలిపింది. ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

₹75 లక్షల వరకు రుణాలపై 6.70 శాతం వడ్డీ, ₹75 లక్షల నుంచి ₹5 కోట్ల వరకు రుణ మొత్తంపై 6.75 శాతం వడ్డీ వర్తిస్తుందని పేర్కొంది. ప్రాసెసింగ్‌ ఫీజుపైనా నూరు శాతం రాయితీ అందిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. అదేవిధంగా ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా హోమ్‌ లోన్‌ తీసుకుంటే మరో 5 బేసిస్‌ పాయింట్ల అదనపు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రుణ గ్రహీతలకు అదనంగా మరో 5 బేసిస్‌ పాయింట్ల రాయితీని అందిస్తున్నట్లు పేర్కొంది. ఎస్‌బీఐ బ్యాంకు గృహ రుణ పోర్ట్‌ఫోలియో ఇప్పటికే ₹ 5 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. 31 డిసెంబర్ 2020 నాటికి బ్యాంక్ ₹35 లక్షల కోట్లకు పైగా డిపాజిట్ బేస్ కలిగి ఉంది. 

చదవండి:

ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఎఫ్ రూల్స్!

రూ.299కే బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement