సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో ఏదైనా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అందించే లోన్లు మరింత సులభంగా లభించే వీలుంటుంది. అప్పు ఇచ్చే ముందు ప్రతి ఆర్థిక సంస్థ సిబిల్‌ను చెక్ చేస్తుంది. సిబిల్ 750 కంటే ఎక్కువ ఉంటే లోన్లు జారీ చేయడం సులభం. మరి ఈ సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలుసా.. ప్రస్తుతం చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. కార్డు బకాయిలు చెల్లించే సమయంలో చిన్న కిటుకు ఉపయోగిస్తే సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ‘ఆరేళ్లలో 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలి’
క్రెడిట్‌కార్డు బిల్లు జనరేట్ అయ్యాక చెల్లింపు కోసం కొన్నిరోజులు గడువు ఇస్తారు కదా. అయితే కార్డు బిల్లును గడువులోపు ఒకేసారి పూర్తిగా చెల్లించకుండా, రెండు లేదా మూడు సార్లు చెల్లిస్తే సిబిల్ పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ఈ నెల 15వ తేదీన రూ.10,000 కార్డు బిల్లు వచ్చిందనుకుందాం. చెల్లింపు గడువు తేదీ 30 అనుకుందాం. అయితే ఈ 15 రోజుల్లో రెండుసార్లు అంటే ఒకసారి రూ.6000, మరో 5-6 రోజులకు మిగతా రూ.4000 చెల్లించాలి. దీనివల్ల పేమెంట్ రికార్డు పెరుగుతుంది. దాంతో సిబిల్ అధికమయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం గుర్తించుకోవాలి. గడువులోపు కచ్చితంగా పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment