గురువులకు దిశానిర్దేశం
సమాజానికి దిశానిర్దేశం చేసే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు ఎప్పటికప్పుడు మరింతగా నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉందంటోంది హైదరాబాద్ సహోదయ స్కూళ్ల బృందం. మారుతున్న ప్రపంచానికి తగినట్లుగా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకతను పెంపొందించాల్సిన బాధ్యత గురువులపై ఉందని స్పష్టం చేసింది. శనివారం నగరంలోని పర్యాటకభవన్‌లో సీబీఎస్‌ఈ పాఠశాలల సంఘం.. హైదరాబాద్ సహోదయ స్కూల్స్ కాంప్లెక్స్ (హెచ్.ఎస్.ఎస్.సి) పాఠశాలలను నడిపించే ప్రిన్సిపాళ్లకు ప్రత్యేకంగా సదస్సు జరిపింది.
మీట్, టాక్, స్పీక్, లిజన్, షేర్, డిస్కస్ అంశాలతో మూడు విభాగాలుగా కార్యక్రమాలు నిర్వహించారు. సదస్సులో హెచ్‌ఎస్‌ఎస్‌సీ అధ్యక్షుడు, తక్షశిల పబ్లిక్‌స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్.నవీన్‌రెడ్డి; కార్యదర్శి, సిల్వర్‌ఓక్స్ స్కూల్ ప్రిన్సిపాల్ సీతామూర్తి; ట్రెజరర్, మెరిడియన్ స్కూల్ (బంజారాహిల్స్) ప్రిన్సిపాల్ ప్రతిమాసిన్హా తదితరులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ప్రిన్సిపాళ్లు జ్ఞానాన్ని సముపార్జించినప్పుడే వారు ఉపాధ్యాయులకు మార్గనిర్దేశనం చేయగలరని సీతామూర్తి పేర్కొన్నారు.