WI-fi connection
-
Wi-Fi.. Slow?.. ఈ ట్రిక్‌తో పరుగు ఖాయం
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవవారికి, కంటెంట్ క్రియేటర్స్‌కు, స్మార్ట్ హోమ్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది తప్పనిసరి. ఇందుకోసం వినియోగించే వైఫై కాలం గడిచేకొద్దీ స్పీడ్ తగ్గుతుంటుంది. దీంతో యూజర్స్‌లో అసహనం తలెత్తుతుంది. ఇలా జరగకూడదంటే కొన్ని ట్రిక్కులను, స్టెప్స్‌ను ఫాలో చేయడం ద్వారా Wi-Fiని పరిగెత్తించవచ్చు.మన ఇంటిలోని కొన్ని ఉపకరణాలను వినియోగించి Wi-Fi సిగ్నల్స్‌ను రిఫ్లక్ట్ లేదా రీడెరెక్ట్ చేయవచ్చు. ఫలితంగా ఇంటర్నెట్ స్పీడందుకుంటుంది. రూటర్ వెనుక భాగాన అల్యూమినియం ఫాయిల్‌ను అమర్చడం ద్వారా దానిని ఒక షిఫ్ట్ రిఫ్లెక్టర్‌గా మార్చవచ్చు. ఫలితంగా దాని సిగ్నల్‌ను ఇంప్రూవ్ చేయవచ్చు. ఇందుకోసం అల్యూమినియం ఫాయిల్‌ను ఒక అట్టకు అతికించాల్సి ఉంటుంది. తరువాత దానిని రూటర్ వెనుక భాగాన ఉంచాలి. అయితే దీనిని అమర్చేటప్పుడు ఫాయిల్ రూటర్‌లోని ఏ భాగానికీ టచ్ కాకుండా చూసుకోవాలి. ఇది Wi-Fi రూటర్‌కు సిగ్నల్ అవాంతరాలను నివారిస్తుంది.Wi-Fi రూటర్ ఓవర్ హీటింగ్‌కు గురికాకుండా చూసుకోవడం మరొక ముఖ్యమైన పని. ఇందుకోసం Wi-Fi రూటర్‌ను ఎండ తగలని లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం నుంచి వేడి వెలువడని ప్రాంతంలో ఉంచడం తప్పనిసరి. Wi-Fi రూటర్‌ను చల్లని ప్రాంతంలో ఉంచడం ద్వారా అది వేడెక్కకుండా చూడగలుగుతాం. Wi-Fi స్పీడ్ స్లో అయినప్పుడు దానిని రోజుకు ఒక్కసారైనా స్విచ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వలన Wi-Fi కనెక్టివిటీ రిఫ్రెష్ అవుతుంది. ఇంప్రూవ్ కూడా అవుతుంది. ఈ ఉపాయాలను అనుసరించి మీ Wi-Fi సిగ్నల్‌ను మెరుగుపరుచుకోండి.ఇది కూడా చదవండి: పలు కుంభమేళా రైళ్లు రద్దు.. టిక్కెట్ బుక్ చేసుకుంటే నగదు వాపస్ -
హైదరాబాదీలకు శుభవార్త! అంతటా ఫ్రీ వై ఫై సేవలు
హైదరాబాద్: నగర వాసులకు శుభవార్త! ఇంటి నుంచి బటయకు వస్తే ఇంటర్నెట్ ఉండదనే దిగులు ఇకపై అక్కర్లేదు. నగరంలో మీరు ఏ మూలకు వెళ్లినా ఇంటర్నెట్ సదుపాయం మిమ్మల్ని అంటుకునే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హై-ఫై ప్రాజెక్టులో భాగంగా ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. 3000 హాట్‌స్పాట్స్ తెలంగాణ ప్రభుత్వ సహాకారంతో ప్రముఖ ఇంటర్నెట్ ప్రొవైడర్ యాక్ట్ నగరంలో 3,000 హాట్స్పాట్లను అందుబాటులోకి తేనుంది. నగరం నలుమూలలా జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఆగష్టు 4వ తేదిన రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ఈ హాట్‌స్పాట్ సెంటర్లను ప్రారంభించనున్నారు. 2015 నుంచి తెలంగాణ ప్రభుత్వం 2015లో హైదరాబాద్ నగరంలో వంద చోట్ల ఉచిత వైర్లెస్ ఫిడిలిటీ (వై-ఫై) సర్వీసులను హై-ఫై పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ హై-ఫై సెంటర్ల దగ్గర ఎవరైనా గరిష్టంగా 5 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అరగంట పాటు వైఫై సేవలను పొందే అవకాశం కల్పించింది. ఆ తర్వాత క్రమంగా ఈ సేవలను విస్తరిస్తూ వస్తోంది. సౌకర్యం గతానికి భిన్నంగా ఈసారి పెద్ద తెలంగాణ ప్రభుత్వం, యాక్ట్ సంస్థలు కలిసి భారీ స్థాయిలో ఫ్రీ వై ఫై సెంటర్లను ప్రారంభిస్తున్నారు. నగరం నలుమూలలా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే టూరిస్టులు, విద్యార్థులతో పాటు సామాన్యులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. -
ఎక్కడ వై-ఫై ఉంటే అక్కడ వాలిపోతున్న యువత
నల్గొండ: రాత్రి 11 గంటలు అవుతుంది భువనగిరి బస్టాండ్‌లో ఒక యువకుడు ఆటు ఇటు తచ్చాడు తున్నాడు. అక్కడే ఉన్న మరొకతను ఎందుకలా తచ్చాడుతున్నావంటే ఇక్కడ రోజు ఉచిత వైఫై వచ్చేది ఈరోజు రావడంలేదు అని సమాధానం ఇచ్చాడు. దీంతో వైఫై కనెక్షన్ ఉన్న యజమానిని అడిగితే పాస్ వర్డ్ మార్చాడని తెలియడంతో ఉసూరుమంటూ వెళ్లిపోయాడు. ఇప్పుడు వైఫై అనేది కేవలం నగరాలకు మాత్రమే పరిమితం కావడం లేదు.. చిన్న చిన్న పట్టణాలకు కూడా ఇంటర్నెట్ పాకడంతో ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలే కనిపిస్తున్నాయి.ఇది ఒక్క భువనగిరి బస్టాండ్‌లో మాత్రమే పరిమితమైన విషయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో వైఫై సేవలు ట్యాంక్ బండ్ ఏరియాలో విస్తరించిన విషయం తెలిసిందే. తాజాగా యాదగిరిగుట్ట దేవస్థానం సన్నిదిలో 100 మీటర్ల పరిధిలో వైఫై సేవలు త్వరలో అందనున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలుః వైఫై కనెక్షన్ కోసం ఇప్పుడు యువత ఆండ్రాయిడ్ పోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.అతి తక్కువ ధర 2500 నుంచి ఆండ్రాయిడ్ పోన్లు లభిస్తుండడంతో యువత ఎప్పటికప్పుడు పాత ఫోన్లకు టాటా చెప్పి ఆండ్రాయిడ్ పోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఇంటర్నేట్ సౌకర్యం కోసం వివిధ కంపెనీలు రకరకాల టారీఫ్‌లు ఇస్తున్నాయి,. వైఫై ఉన్నవారి అవస్థలు: తమ అవసరాల కోసం వైఫై కనెక్షన్ తీసుకున్న వారు ఔత్సాహికులతో అవస్థలు పడుతున్నారు. పదుల సంఖ్యలో తమ పరిధిలో వైఫైవాడుతుండడంతో వారిసేవలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఏరోజు కారోజు తమ వైఫై కోడ్‌ను మార్చుకుంటున్నారు. మరి కొందరికి ఈ విషయం తెలియక ఇబ్బందులు పడుతున్నారు.