![యాదగిరిగుట్టపై వైఫై సౌకర్యం](/styles/webp/s3/article_images/2017/09/3/71416251292_625x300_0.jpg.webp?itok=5NI4xt9N)
యాదగిరిగుట్టపై వైఫై సౌకర్యం
యాదగిరిగుట్ట (నల్లగొండ జిల్లా) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరిధిలో అతి తర్వరలో వై-ఫై సౌకర్యం అందుబాటులోకి రానుంది. రిలయన్స్ సంస్థ (ముఖేష్ అంబానీ గ్రూప్) ఆధ్వర్యంలో ఈ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు దేవస్థానం ఈవో గీతారెడ్డి తెలిపారు. రిలయన్స్ సంస్థకు చెందిన మేనేజర్ వంగ మల్లేష్ ఈ విషయమై దేవస్థానం ఈవో గీతారెడ్డితో సోమవారం చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... దేవాలయం మినహా చుట్టు పక్కల ప్రాంతాలలో 100 మీటర్ల వరకు ఈ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.