నయా కల్చర్ | new Culture | Sakshi
Sakshi News home page

నయా కల్చర్

Published Mon, Oct 20 2014 12:07 AM | Last Updated on Mon, Aug 13 2018 3:30 PM

నయా కల్చర్ - Sakshi

నయా కల్చర్

టాంగ్ రాజవంశం కాలం సాహిత్యానికి, కళలకు స్వర్ణ యుగం అని చైనీయులు చెబుతుంటారు. ఆ కాలం నాటి 40 వేలకు పైగా పద్యాలు పదిల పరుస్తూ... వాటిని నేటి తరానికి అందిస్తున్నాయి సీసీటీవీ, చైనా సెంట్రల్ న్యూరీల్స్ కార్పొరేషన్‌లు. అంతేకాదు.. ఆ పద్యాలలో కొన్నింటిని షార్ట్ ఫిలింస్‌గా రూపొందించి జనబాహుళ్యానికి మరింత చేరువ చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. 1100 ఏళ్ల క్రితం చైనా రచయిత వెయ్ జువాంగ్ రాసిన పుసుమన్ విషాద ప్రేమకథతో కూడిన గేయాలతో పాటు సాంగ్ ఆఫ్ ఏ వాండరర్ తల్లీకొడుకుల మధ్య ఉన్న ప్రేమను వివరించే కథలు కూడా ఉన్నాయి.    - కళ
 
చైనా కవితా సంపదను, ట్రెడిషనల్ కల్చర్‌ని ప్రభావవంతంగా యువతరానికి చెప్పేందుకు ఈ బుల్లి సినిమాలే చక్కటి
 మాధ్యమమని బీజింగ్ ఫిలిం అకాడమీ ప్రెసిడెంట్ జాంగ్ హుజున్ అన్నారు. ఈ క్రమంలో 108 పద్యాలను షార్ట్‌ఫిలింస్‌గా మలిచేందుకు ఎంపిక చేశారు. దీని ద్వారా ఆ పద్యాలతో చక్కని కథను, నాటి జ్ఞాపకాలను తెరపై చూపించటం వీలవుతుందని ఈ ఫిలిం మేకర్స్ అభిప్రాయం. 15 నిమిషాల ఈ చిత్రాల్లో చైనా ప్రముఖ నటులు, దర్శకులు పాలుపంచుకోబోతున్నారు.
 
ఓన్లీ బెస్ట్
‘బెస్ట్‌పోయెమ్స్‌ని ఎంచుకోవడమే కాదు, వాటితో మంచి కథ ప్రెజెంట్ చేయటానికీ అవకాశం ఉందో లేదో కూడా చూసి అలాంటి వాటినే తీసుకున్నాం. చైనా చారిత్రక సాహిత్యాన్ని నేటి తరానికి పరిచయం చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో రూపొందిస్తున్న  108 షార్ట్ ఫిలింస్‌లో 70 ఇప్పటికే పూర్తయ్యాయి. టాంగ్ రాజ వంశం కాలం నాటి పద్యాలను ప్రమోట్ చెయ్యటం దీని ఉద్దేశం’ అన్నారు జాంగ్ హుజున్. షార్ట్ ఫిలింస్ ద్వారా సాహిత్యాన్ని, చరిత్రను, సంస్కృతిని నేటి తరానికి పరిచయం చేయాలంటూ చైనాలో మొదలైన ఈ ట్రెండ్ క్రమంగా అన్ని దేశాలకూ విస్తరించే అవకాశం ఉందనేది విస్తరించే అవకాశం లేకపోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement