సృజనాత్మక కెరీర్.. సిరామిక్ ఇంజనీరింగ్ | Creative career .. Ceramic Engineering | Sakshi
Sakshi News home page

సృజనాత్మక కెరీర్.. సిరామిక్ ఇంజనీరింగ్

Published Tue, Oct 28 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM

సృజనాత్మక కెరీర్.. సిరామిక్ ఇంజనీరింగ్

సృజనాత్మక కెరీర్.. సిరామిక్ ఇంజనీరింగ్

అప్‌కమింగ్ కెరీర్
 
పింగాణి అనగానే ఠక్కున చైనా గుర్తుకొస్తుంది. రంగురంగుల పింగాణి కప్పులు, సాసర్లు, ప్లేట్లు, మెరిసిపోయే అందమైన అలంకరణ వస్తువులు గుర్తుకొస్తాయి. కానీ, ఇది వీటికే పరిమితం కాలేదు. ఆధునిక కాలంలో చాలా రంగాల్లో పింగాణి వాడకం అధికమైంది. దీనికొక శాస్త్రమే ఉంది. అదే.. సిరామిక్ ఇంజనీరింగ్. కృత్రిమ ఎముకల నుంచి  రాకెట్లలో హీట్‌షీల్డ్‌ల వరకు ఎన్నో ఆధునిక ఉపకరణాల తయారీకి సిరామిక్‌ను ఉపయోగిస్తున్నారు. సిరామిక్ ఇంజనీర్లకు ప్రస్తుతం దేశవిదేశాల్లో లెక్కలేనన్ని ఉ ద్యోగావకాశాలు ఉన్నాయి. సైన్స్ అండ్ టె క్నాలజీతోపాటు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌పై ఆసక్తి ఉన్నవారు ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకో వచ్చు. అధిక వేతనాలతో కూడిన కొలువుల్లో కుదురుకోవచ్చు.
 
మెండుగా కొలువులు

పింగాణి అనేది ఇనార్గానిక్ నాన్ -మెటాలిక్ మెటీరియల్. దీనికి అధిక ఉష్ణోగ్రతను తట్టుకొనే గుణం ఉంది. ఇందులో ట్రెడిషనల్, అడ్వాన్స్‌డ్ సిరామిక్స్ అనే రెండు రకాలుంటాయి. ట్రెడిషనల్ సిరామిక్స్‌తో కప్పులు, పాత్రలు, వాష్ బేసిన్ల వంటివి తయారు చేస్తారు. అడ్వాన్స్‌డ్ మెటీరియల్‌ను కంప్యూటర్లలో మెమరీ కోర్‌లు, ఇన్సులేటర్లు, బాయిలర్లు, ఫర్నేస్‌లు, కన్వర్టర్ల తయారీలో ఉపయోగిస్తారు. ఎలక్ట్రానిక్ సిరామిక్స్‌ను అభివృద్ధి చేయకపోతే సెల్‌ఫోన్ల తయారీ సాధ్యమయ్యేదే కాదు. రక్షణ రంగంలో రాడార్లు, సబ్‌మెరైన్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, స్పేస్ షటిల్స్‌లో సిరామిక్స్ వాడకం తప్పనిసరి. సిరామిక్ ఇంజనీర్లకు ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్లు, గ్లాస్, సిమెంట్, అల్యూమినియం, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఆప్టిక్స్ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. అలాగే రవాణా, మెడిసిన్, ఎనర్జీ కన్వర్షన్, పొల్యూషన్ కంట్రోల్, ఏరోస్పేస్, నిర్మాణ రంగాల్లో సిరామిక్ ఇంజనీర్లకు మంచి డిమాండ్ ఉంది.
 
అర్హతలు : సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైన తర్వాత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి, బీటెక్ సిరామిక్ ఇంజనీరింగ్‌లో చేరొచ్చు. ఎంటెక్, డాక్టరేట్ కూడా పూర్తిచేస్తే ఉన్నత అవకాశాలను దక్కించుకోవచ్చు.
 
వేతనాలు : సిరామిక్ ఇంజనీర్లకు విద్యార్హతలు, అనుభవం, పనితీరు, పనిచేస్తున్న సంస్థ స్థాయిని బట్టి జీతభత్యాలుంటాయి. బీటెక్/ఎంటెక్ కోర్సులు చేసినవారు ప్రారంభంలో నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వేతనం పొందొచ్చు. కనీసం ఐదేళ్ల అనుభవం ఉంటే ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.9 లక్షల వేతన ప్యాకేజీ అందుకోవచ్చు.
 
కావాల్సిన స్కిల్స్
: సిరామిక్ ఇంజనీరింగ్ రంగంలో రాణించాలంటే... బేసిక్ సెన్సైస్‌పై గట్టి పట్టుండాలి. సృజనాత్మకత తప్పనిసరి. మెరుగైన కమ్యూనికేషన్, అనలిటికల్ స్కిల్స్, టీమ్ స్పిరిట్ అవసరం. సమస్యలను వేగంగా పరిష్కరించే నైపుణ్యం కావాలి. ఎప్పటికప్పుడు వృత్తిపరమైన పరిజ్ఞానం పెంచుకొనే అలవాటు ఉండాలి. డిజైన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి.
 
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు


బెనారస్ హిందూ యూనివర్సిటీ. వెబ్‌సైట్: www.bhu.ac.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-రూర్కెలా
వెబ్‌సైట్:  www.nitrkl.ac.in
గవర్నమెంట్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సిరామిక్ టెక్నాలజీ-కోల్‌కతా. వెబ్‌సైట్: http://gcect.ac.in/
అన్నా యూనివర్సిటీ. వెబ్‌సైట్: www.annauniv.edu
పీడీఏ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్-గుల్బర్గా
వెబ్‌సైట్: http://pda.hkesociety.org/
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement