సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేలోని 32 ప్రధాన రైల్వేస్టేషన్‌లలో 450 ఇంటర్నెట్ ఆధారిత సీసీటీవీల ద్వారా స్టేషన్‌ల పరిశుభ్రతను పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ తెలిపారు. ఆన్‌లైన్ వీడియోలో వీ క్షించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా గురువా రం జోన్ అంతటా భారీ ఎత్తున మహాశ్రమదానం నిర్వహిం చారు.
ఈ సందర్భంగా రైల్‌నిలయంలో సీసీటీవీల పనితీరును ఆయన పరిశీలించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, విజయవాడ, తిరుపతి, కాకినాడ, గుంతకల్, గుంటూరు, అనంతపురం, కడప, నెల్లూరు, రాజమండ్రి, ఒంగోలు, రేణిగుంట, నిజామాబాద్, మహబూబ్‌నగర్, తదితర స్టేషన్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దశలవారీగా అన్ని ప్రధాన స్టేషన్‌లకు విస్తరిస్తామన్నారు.