ముంబై: ఇక నుంచి మహిళా ప్రయాణికులు రైళ్లలో అభద్రతా భావంతో ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి రక్షణగా రైళ్లలో ఇక సీసీటీవీ కెమెరాలు రానున్నాయి. ముంబయిలోని సిటీ సబర్బన్ రైళ్లలో మహిళ బోగీల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. అందుకుగల సాధ్యసాధ్యాలను పరిశీలించాలని రైల్వే శాఖను కోరింది.
ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుమోటోగా స్వీకరించిన కోర్టు అందుకు తగిన ఆదేశాలిచ్చింది. స్థానిక రైళ్లలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక బోగీలు కేటాయించాలని, పశ్చిమ, మధ్య, హార్బర్ మార్గాల్లో రోజు దాదాపు 50 లక్షల మంది ప్రయాణిస్తారని వారికోసం భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. స్థానికులు ఇష్టమొచ్చినట్లు పట్టాలు దాటకుండా కంచె నిర్మించాలని సూచించింది.
ఇక సిటీ రైళ్లలో సీసీటీవీ కెమెరాలు!
Published Wed, Feb 3 2016 7:42 PM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM
Advertisement
Advertisement