అమ్మో.. రెప్పపాటులో కత్తి పోటు తప్పింది | Caught on camera: Thief stabs guard in Chandni Chowk | Sakshi
Sakshi News home page

అమ్మో.. రెప్పపాటులో కత్తి పోటు తప్పింది

Published Mon, Jan 25 2016 4:10 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM

అమ్మో.. రెప్పపాటులో కత్తి పోటు తప్పింది

అమ్మో.. రెప్పపాటులో కత్తి పోటు తప్పింది

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ దొంగ దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఓ షాపు ముందు కాపలాగా నిద్రిస్తున్న వ్యక్తిని అమాంతం పొడిచిచంపేందుకు ప్రయత్నించాడు. దొంగ అలికిడిని రెప్పపాటులో గమనించిన కాపలా వ్యక్తి స్వల్పగాయంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ తప్పించుకున్నాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో ప్రకారం ఢిల్లీలోని చాందీ చౌక్ ఏరియాలో ఓ స్టేర్ పై దుకాణం ఉంది. దాని ముందే సెక్యూరిటీ గార్డు నిద్రపోయాడు.

రాత్రి సమయం కావడంతో అక్కడి మెట్లు ఎక్కి దొంగతనానికి మంకీ టీ షర్ట్ లో వచ్చిన దొంగ అక్కడ గార్డును చూసి తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తిని బయటకు తీశాడు. రెండు చేతులతో దాని పిడిని గట్టిగా పట్టుకున్నాడు. రెండుమూడుసార్లు కిందికి వంగి చూసి కాళ్లు, తల భాగం ఎటువైపు ఉందా అని పరిశీలించాడు. ఆ తర్వాత పైకి లేచి ఊపిరి బిగబట్టి గట్టిగా పొడిచేసే ప్రయత్నం చేశాడు. రెప్పపాటు ఆ గార్డు ఆ పోటు నుంచి తప్పించుకుని స్వల్పగాయాలతో మెట్లపై నుంచి దొర్లుతూ ఆ ప్రాంతం నుంచి పరుగెత్తాడు. దీంతో దొంగ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. టీనేజీ యువకుడిలాగే ఉన్న ఆ దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement