stabs
-
నివారించలేని వింత వ్యాధి! తనను తాను గాయపరచుకునేలా..
మనుషుల వికృత ప్రవర్తనలకు తగ్గట్టుగానే వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఇదేం వ్యాధిరా బాబు అని ముక్కుమీద వేలేసుకునేలా ఉన్నాయి వాటి పేర్లు. కోపంతో మరో మనిషిని చంపడం ఒక తరహ అయితే..అదే చికాకు కోపంతో తనను తాను చంపేసుకునేలా ప్రేరేపిస్తుంది ఈ వ్యాధి. ఆ తర్వాత ఆ వ్యక్తికి తాను చేసిందేంది గుర్తుండదట. తనపై ఎవరో దాడి చేసినట్లు లేదా ప్రమాదం జరిగినట్లు భావిస్తారట. వాస్తవం వివరించిన వారికి అదేమీ గుర్తుండదట. చూడ్డానికి టీవీల్లో చూసే చేతబడి మాదిరిగా లేదా దెయ్యంలాంటి వ్యాధిలా ఉంటుంది. ఈ వింత వ్యాధి బారినపడ్డ మహిళ స్థితి గురించే ఈ కథనం!. బ్రిటన్‌కి చెందని 41 ఏళ్ల షార్లెట్ హెవిట్ ఉన్నటుండి ఆస్పత్రి పాలయ్యింది. ఆమె భర్త హుటాహుటినా ఆస్పత్రికి తీసుకురావడంతో త్రుటిలో ప్రాణాలతో బయటపడింది. ఆ టైంలో ఆమె సుమారు ఒక వారం వరకు పూర్తి కోమాలో ఉంది. పైగా తాను ఎందుకు ఆస్పత్రిలో ఉన్నానని, ఏం జరిగిందని ఎదురు ప్రశ్నించడంతో ఆమె భర్తతో సహా వైద్యులు సైతం కంగుతిన్నారు. దీంతో వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి ఆమెక హంటిగ్టన్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు తేల్చారు. ఈ వ్యాధి కారణంగా ఉన్నట్లుండి ఆమె ఒక విధమైన ఉద్వేగానికిలోనై తనను తాను హాని చేసుకునులా వింతగా ప్రవర్తిస్తుందని చెప్పారు. ఇది మెదడులోని భాగాలను నెమ్మది నెమ్మదిగా పనిచేయకుండా నిలిపేసి మానిసికంగా దెబ్బతినేలా చేస్తుంది. ఒక విధంగా సైకోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ మేరకు ఆమె భర్త మాట్లాడుతూ..తన భార్య షార్లెట్ ఆరోజు సడెన్‌గా గదిలోపలకి వచ్చి గట్టిగా అరుస్తూ.. కత్తితో తనను తాను గట్టిగా పొడుచుకుందని చెప్పుకొచ్చాడు. ఈ హఠాత్పరిణామానికి తనకేం పాలిపోలేదని వాపోయాడు. కానీ ఇప్పుడేమో ఆమె తనకేమైందని ప్రశ్నిస్తుంటే చాలా గందరగోళంగా ఉందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఈ అసంఘటిత చర్య కారణంగా వైద్యులు ఆమెకు మూడుసార్లు సర్జరీ చేశారు. ఆమె పొట్టలోని ప్రేగుల్లో పావు వంతు దాక డ్యామేజ్ కాకుండా కాపాడారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఈ హంటిగ్టన్స్ వ్యాధి అనేది వారసత్వంగా వచ్చే రుగ్మత. దీని వలన మెదడులోని కొన్ని భాగాల్లో నరాలు క్రమక్రమంగా విఛ్చిన్నమై పోతాయి. ఫలితంగా మెదడులోని ఇతర ప్రాంతాల్లోని కదలికలను నియంత్రించే అవయవాల పనితీరు మార్పు వచ్చి.. జ్ఞాపక శక్తిని కోల్పోవడం, నిరాశ నిస్ప్రుహలకు లోనై వికృతంగా మారిపోవడం జరుగుతుంది. ఇవే ఈ వ్యాధి ప్రదాన లక్షణాలు. ఈ వ్యాధి బారినపడ్డవారి శరీరంలో అసంకల్పిత కుదుపు లేదా చంచలమైన కదలికలు సడెన్‌గా వస్తాయి. షార్లెట్ తాను ఇలా 2014లో 23 ఏళ్ల వయసులో ఇలాంటి స్థితిలోనే ఉన్నాని చెప్పుకొచ్చింది. అయినప్పటకీ తాను జీవితాన్ని కొనసాగించగలిగానని, మళ్లీ ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నానని వాపోయింది. ఈ వ్యాధి కారణంగా కుక్కును పార్క్‌లో వదిలేయడం, గ్యాస్ ఆఫ్ చేయడం మరచిపోవడం తదితర ఎన్నో సంఘటనలు జరిగాయని, ఇవే తనను నిరాశలోకి నెట్టేసి తనను తాను గాయపరుచుకునేలా ప్రేరేంపించాయని వెల్లడించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధికి ఎలాంటి నివారణ లేదు. కానీ రోగులు మానసిక ఆరోగ్యానికి సత్వరమే చికిత్స తీసుకుంటే నయం అవుతుందని చెబుతున్నారు. ఈ వ్యాధి వస్తే తొలుత రోజు వారీ జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయదు. కానీ క్రమేణా సాధారణ పనులను సైతం సొంతంగా చేసుకోలేని ధీనస్థితికి వచ్చేస్తారు. ఈ వ్యాధికి గల కారణం.. ఈ వ్యాధిగ్రస్తుల డీఎన్ఏ ఈ హంటింగ్టిన్స్ ప్రోటీన్‌ని తయారు చేయడానికి కావాల్సిన సమాచారాన్ని నిల్వ చేయదు. ఫలితంగా అవి అసాధారణ ఆకారంలో పెరిగా మెదడులోని న్యూరాన్లను నాశనం చేస్తాయి. దీంతో శరీర కదలికలను నియంత్రించే మెదడులోని బేసల్ గాంగ్లియాలో నరాలు నాశనం అవ్వడం జరుగుతుంది. ఫలితంగా ఆలోచన, నిర్ణంయ తీసుకోవడం, జ్ఞాపకశక్తి తదితర పనులు నిర్వహించే మెదడు పనితీరుని ప్రభావితం చేసి సడెన్గామనిషిని ఓ ఉన్మాదిలా మారుస్తుంది. (చదవండి: రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి హెచ్ఐవీ ఫిజీషియన్ ఆయన!) -
దారుణం: ప్రైవేటు ట్యూటర్‌ను పేపర్ కట్టర్‌తో..
ఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మైనర్ తన ప్రైవేట్ ట్యూటర్ని పేపర్ కట్టర్‌తో కిరాతకంగా హత్య చేశాడు. లైంగికంగా వేధింపులకు గురి చేశాడని అందుకే తాను ఈ ఘటనకు పాల్పడ్డానని మైనర్ తెలిపాడు. దేశ రాజధానిలోని జామియా నగర్లో ఈ ఘటన జరగగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాకిర్ నగర్లో కుటుంబంతో కలిసి ఉంటున్న వసీమ్(28) ఓ ప్రైవేట్ ట్యూటర్‌గా పనిచేస్తున్నారు. పక్కనే జామియా నగర్లో ఉన్న ఓ విద్యార్థికి పాఠాలు బోధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆగష్టు 30న వసీమ్‌ను మైనర్ విద్యార్థి పేపర్ కట్టర్‌తో హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వసీమ్‌ను విద్యార్థి తండ్రి గుర్తించి, పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేయగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వసీమ్‌ను మైనర్ విద్యార్థే కిరాతకంగా హత్య చేసినట్లు గుర్తించారు. నేరం అంగీకరించిన విద్యార్థి.. తనను లైంగికంగా పలుమార్లు వేధించాడని, ఆ వీడియోలు తీసి, వాటిని బయటపెడతానని బెదిరించినట్లు ఆరోపించాడు. ఈ ఘటనలో మైనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదీ చదవండి: సోనియాగాంధీకి ఆస్వస్థత.. గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స.. -
వీపున కత్తిపోటు..ప్రాణం పోసిన కర్నూలు పెద్దాస్పత్రి
కర్నూలు(హాస్పిటల్): కత్తిపోట్లకు గురై వీపున కత్తితో వచ్చిన ఓ వ్యక్తికి కర్నూలు వైద్యులు సకాలంలో స్పందించి శస్త్రచికిత్స చేసి ప్రాణం పోశారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరుకు చెందిన శ్రీనివాసరెడ్డికి ఆస్తి వివాదాలు ఉండటంతో కొంత కాలంగా అనంతపురం పట్టణంలోని మారుతినగర్‌కు వచ్చి స్థిరపడ్డాడు. శనివారం రాత్రి భోజనం ముగించుకుని బయట వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కత్తి శ్రీనివాసరెడ్డి వీపున అలాగే దిగబడిపోయింది. వెంటనే అతన్ని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా కర్నూలు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ వెంటనే కార్డియోథొరాసిక్ హెచ్‌వోడి డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డికి ఫోన్ చేశారు. శ్రీనివాసరెడ్డి ఆరోగ్యపరిస్థితి గురించి అక్కడి వైద్యులు, పోలీసులతో మాట్లాడారు. వెంటనే కర్నూలుకు తీసుకురండి ఆపరేషన్ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. దీంతో అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో శ్రీనివాసరెడ్డిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. తెల్లవారుజాము నుంచే ఎక్స్‌రే, సీటీస్కాన్ తీసి కత్తి ఎంత వరకు వెళ్లిందో పరిశీలించారు. ఆదివారం ఉదయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీంద్రలతోపాటు అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ కొండారెడ్డితో కలిసి శ్రీనివాసరెడ్డికి ఆపరేషన్ చేసి ప్రాణం పోశారు. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి కోలుకుంటున్నారని వివరించారు. -
ఆమెను చంపి బతికించాలనుకున్నాడు! కానీ, చివరికి..
చనిపోయిన వాళ్లను తిరిగి బతికించవ్చనేది అతని నమ్మకం. అందుకోసం ఏకంగా ఒక మహిళను కడతేర్చి జైలుపాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...34 ఏళ్ల స్టీఫెన్ జోసెఫ్ ఆండర్సన్ నవంబర్‌లోని తన ఇంటి పార్క్ వద్ద రెబెక్కా లిన్ లాంబెర్డ్ అనే మహిళను కలిశాడు. ఆ తర్వాత ఆమె కొన్నిరోజులకు శవమై కనిపించింది. అనుకోకుండా ఒక రోజు అధికారులకు ఆండర్స్ ఒక చేతిలో కత్తి, మరో చేతిలో సుత్తితో కనిపించాడు. దీంతో వారు అప్రమత్తమై ఆయుధాలను పడేయమని చెప్పి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే అతను మొదట తప్పు దారి పట్టించేలా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత అతను లాంబెర్డ్ అనే మహిళను చంపినట్లు ఒప్పుకున్నాడు. చనిపోయిన వాళ్లను తిరిగి బతికించేందుకు ఆమెను కత్తితో పొడిచి హతమార్చినట్లు చెప్పాడు. ఐతే విచారణ సమయంలోనే అతడు తన తల్లికి ఫోన్‌చేసి పిల్లలను తన బెడ్రూమ్ వద్దకు పోవద్దని చెప్పినట్లు అధికారుల తెలిపారు. దీంతో నిందితుడి తల్లిని విచారించగా...ఆమె అతడి బెడ్రూమ్ వద్ద ఒక స్త్రీ మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఈ మేరకు పోలీసులు సదరు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అతనిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడు జైలులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: ఒంటిపై అండర్వేర్ తప్ప నులుపోగులేదు ..అలానే దొంగలను పరిగెత్తించాడు) -
ఆ చేప చిక్కడమే విషాదం ... హఠాత్తుగా మీదకు దూకి...
ఫ్లోరిడాలోని ముగ్గురు మహిళలు 100 పౌండ్ల (దాదాపు 45 కిలోల) సెయిల్ ఫిష్‌ని పట్టుకున్నారు. హమ్మయ్య అంటూ ఆనందంగా నీటి నుంచి పైకి తీస్తుండగా ఒక్కసారిగా అనుహ్య ఘటన చోటుచేసుకుంది. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అసలేం జరిగిందంటే...ముగ్గురు మహిళలు ఒక పడవలో చేపల వేటకు వెళ్లారు. పాపం వారు ఎంతో కష్టబడి దాదాపు 45 కిలోల సెయిల్ ఫిష్‌ని పట్టుకున్నారు. అంతే తర్వాత వారు చాలా ఆనందంగా ఆ చేపను ఫిషింగ్ ట్రైలోకి వేయడం కోసం నీటి నుంచి పైకి లాగుతున్నారు. అంతే అది అనుహ్యంగా వారి మీదకు ఒక్క ఊదుటన దాడి చేసింది. ఈ ఆకస్మిక ఘటనలో వారి పక్కన ఉన్న కేథరిన్ పెర్కిన్స్ అనే 73 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సదరు స్నేహితులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆమె పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. సెయిల్ ఫిష్ అనేది అత్యంత వేగవంతమైన చేప జాతులలో ఒకటి. ఇవి సమద్రం అడుగు భాగాన డీప్‌గా సంచరించేవిగానూ, అత్యంత బలంగా దాడి చేసే చేపలగానూ ప్రసిద్ధి. (చదవండి: అరుదైన ఘటన: రోబోతో చెస్ ఓపెన్... గాయపడిన చిన్నారి) -
కుక్కను కరిచాడు!
ఫెయిర్‌ఫీల్డ్: మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, మనిషే కుక్కను కరిస్తే వార్త అనే మాటను అక్షరాలా నిజం చేసాడో ప్రబుద్ధుడు. అమెరికాలో ఒక దొంగ మంచి టైమ్ చూసుకొని వృద్ధులున్న ఇంటికి కన్నం వేశాడు. దొంగతనం పూర్తయి పారిపోదామనుకునే సమయంలో ఆ ఇంటికి అమెజాన్ డెలివరీ బాయ్ వచ్చాడు. తను పారిపోయేందుకు డెలివరీ ట్రక్కును, లేదంటే చంపేస్తానని బాయ్‌ను దొంగ బెదిరించాడు. దీంతో భయపడిన అమెజాన్ బాయ్ పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు సదరు ఇంటిని చుట్టుముట్టారు. ఎంత ప్రయత్నించినా దొంగను బయటకు రప్పించలేకపోవడంతో చివరకు పోలీసు జాగిలం కార్ట్(కే9)తో కలిసి ఇంట్లోకి వెళ్లారు. దొంగను గుర్తించిన కుక్క అతన్ని పట్టుకుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ దొంగ కుక్కను కరిచి, కత్తితో పొడిచాడని పోలీసులు ప్రకటించారు. చికిత్స కోసం కుక్కను ఆస్పత్రికి పంపారు. దొంగ మత్తు పదార్థాలు వాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిపై పాత కేసులున్నా యని పోలీసులు గుర్తించారు. కొత్తగా కుక్కను కరిచినందుకు, ట్రక్కు దొంగతనానికి, ఇంట్లో దొంగతనానికి కేసులు నమోదు చేశారు. -
విడాకులు కోరిన భార్య...కక్ష్యతో 20 సార్లు కిరాతకంగా పొడిచి...
సాక్షి, బెంగళూరు: మతాలు వేరైనా అతని కోసం పేరు మార్చకుని మరీ వివాహం చేసుకుంది. అంతా హాయిగా ఉందనుకునేలోపే భర్త గురించి ఒక చేదు నిజం తెలుసుకుని షాక్‌కి గురైన ఆమె ఇక నీతో ఉండలేనంటూ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేసింది. ఇదే ఆమె పాలిట శాపమైంది. అతను క్షక్యతో అందరూ చూస్తుండగానే ఆమె పై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసు కథనం ప్రకారం...కర్ణాటకలోని గడగ్ జిల్లా హుబ్బలి నివాసి మహ్మద్ ఎజాజ్ షిరూర్‌ని అపూర్య పురాణిక్ తన పేరు మార్చుకుని మరీ వివాహం చేసుకుంది. అయితే అతని ఇంతకమునుపే వివాహం అయ్యి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారనే విషయం దాచి పెట్టి మరీ అపూర్వని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో తాను చదువుకుంటున్నానని పార్ట్ టైం ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాని మాయమాటలు చెప్పి అపూర్వని పెళ్లి చేసకున్నాడు. ఈ దంపతులనకు ఒక పాప కూడా ఉంది. ఇక భర్త చేసిని మోసం తెలుసుకున్న అపూర్వ ఇక తనతో ఉండకూదని నిర్ణయించుకుని కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. దీంతో క్షక్య పెంచుకున్న అతను అపూర్వ కదలికల పై నిఘా పెట్టి మరీ ఆమె పై దాడి చేసేందుకు ఉపక్రమించాడు. అందులో భాగంగానే ఆమె స్కూటీ నేర్చుకుంటుండగా కొడవలితో కిరాతకంగా దాడి చేశాడు. దీంతో స్థానికులు ఆమెను ఆస్పుత్రికి తరలించారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అతన్ని అరెస్టు చేశాం. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, పైగా ఆమె శరీరంపై దాదాపు 22 కత్తి గాయాలు ఉన్నాయి" అని పోలీసులు చెప్పారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో,ప్రాణాలతో బయటపడిన వ్యక్తి "మీ ధర్మానికి విరుద్ధంగా వివాహం చేసుకోకండి" అంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. (చదవండి: కాబోయే భర్తే కదా అని సహజీవనం చేసింది.. ఇంతలో సీన్ రివర్స్..) -
హ్యాండిచ్చిన ప్రియుడు.. కోపంతో రగిలిపోయిన ఆ యువతి కత్తితో..
సాక్షి, హైదరాబాద్: ప్రేమించి మోసం చేశాడని యువకుడిని ఓ యువతి కత్తితో పొడిచిన ఘటన లంగర్‌హౌస్‌లో కలకలం రేపింది. ఘటనపై వివరాలు సేకరించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్న వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ప్రియుడు దూరం పెట్టాడు. తనను మోసం చేస్తున్నాడనే కోపంతో ఆ యువతి కత్తితో దాడి చేసింది. స్థానికులు అప్రమత్తమై ఆ యువకుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చదవండి: ఫ్యాన్‌కు వేలాడుతూ.. బ్యూటీషియన్ మృతదేహం! వారం తర్వాత.. -
అడ్వాన్స్ ఇవ్వలేదని ప్రయాణికురాలి పీక కోశాడు..
నోయిడా: తనకు అడ్వాన్స్‌గా ఇవ్వలేదనే కోపంతో ఓ ఆటో డ్రైవర్ ప్రయాణికురాలి పీక కోశాడు. గొంతు మీద లోతైన గాయం కావడంతో ఆమెకు మాటలు కూడా రావడం లేదు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆజాంఘర్కు చెందిన శివనాథ్ ఆటో డ్రైవింగ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఓ మహిళ తనను ఆఫీసుకు తీసుకెళ్లమని కోరింది. అయితే ముందుగా అడ్వాన్స్ డబ్బులివ్వంటూ ఆమెను దబాయించాడు. (చదవండి: భార్యభర్తల గొడవలో బలైన మూడేళ్ల చిన్నారి!) దీనికి ఆమె ససేమీరా అనడంతో కోపంతో ఊగిపోయిన ఆటో డ్రైవర్ ఆమె పీకను అడ్డంగా కోసి అక్కడ నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో మాట్లాడటానికి కూడా గొంతు పెగల్లేని స్థితిలో ఉన్న ఆమెను చూసిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆమెను దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు అక్కడ నుంచి సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కానీ ఇంకా మాట్లాడలేకపోతుందని వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘాతుకానికి పాల్పడ్డ శివనాథ్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. (చదవండి: 100కు ఫోన్ చేసి ప్రధానికి బెదిరింపు) -
బోర్డు మీటింగ్‌లోనే తమ్ముడిపై దాడి
సాక్షి, భావనగర్ : కంపెనీ బోర్డు మీటింగ్ లోనే షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. కంపెనీ బోర్డునుంచి తొలగించారన్న అక్కసుతో సొంత తమ్ముడిపైనే దాడికి దిగాడు. తండ్రి, ఇతర బోర్డు సమక్షంలోనే సోదరుడుపై కత్తితో దాడిచేసిన వైనం కలకలం రేపింది. భావనగర్‌లోని వర్తే గ్రామంలోని సిడ్సర్ రోడ్‌లోని తాంబోలి కాస్టింగ్స్ లిమిటెడ్ (టిసిఎల్)వద్ద ఈ సంఘటన జరిగింది. బాధితుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గుజరాత్లో తంబోలి కాస్టింగ్స్ లిమిటెడ్ (టీసీఎల్) డైరెక్టర్లలో ఒకడైన మెహుల్ తంబోలిని తొలగించాలని కంపెనీ బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది. స్వయంగా తండ్రి బిపిన్ తంబోలి (77) అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సస్పెన్షన్‌పై ఆగ్రహించిన మెహుల్ తమ్ముడు వైభవ్‌ను కత్తితో పొడిచి పొత్తికడుపులో పారిపోయాడు.వెంటనే బాధితుడు వైభవ్‌ను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు మొహుల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతనికోసం గాలిస్తున్నారు. 2004లో ఏర్పాటైన టీసీఎల్ బీఎస్ఇ లిస్టెడ్ సంస్థ. ఫెరారీ, ఫియట్, ఫోర్డ్, జనరల్ మోటార్స్, జాగ్వార్, జాన్ డీర్ వంటి ఆటోమోటివ్ కంపెనీలకు విడి భాగాలను సరఫరా చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌గా బిపిన్ తంబోలి ఉండగా, పిఎ సుబ్రమణియన్ వైస్ చైర్మన్‌గా, అన్నదమ్ములు మెహుల్, వైభవ్ ఇద్దరూ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే ఈ వివాదానికి గల కారణాలు, మెహుల్ ను ఎందుకు తొలగించారు తదితర వివరాలు వెలుగులోకి రాలేదు. -
విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది
సాయంత్రం.. సమయం.. 5 గంటలు.. కళాశాల విడిచిపెట్టారు.. మిగిలిన విద్యార్థులతోపాటు ఆ అమ్మాయి కళాశాల నుంచి బయటకు వచ్చి ఇంటివైపు అడుగులు వేస్తోంది. ఇంతలో హఠాత్తుగా దూసుకొచ్చిన ఓ యువకుడు కత్తితో ఆమెపై దాడి చేశాడు. అంతే ఆ ఆమ్మాయి రోడ్డుపైనే కుప్పకూలింది. పట్టణ నడిబొడ్డున.. సినిమాహాలు, పెట్రోల్ బంక్, కళాశాల.. అన్నీ ఉన్న రద్దీ ప్రాంతంలో జరిగిన ఈ దాడితో ఆ ప్రాంతమంతా ఒక్కసారి అలజడి రేగింది. అరుపులు, ఆర్తానాదాలతో దద్దిరిల్లింది. ఈ దారుణం ప్రశాంతతకు మారుపేరైన అనకాపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. సాక్షి, విశాఖపట్నం : అనకాపల్లిలోని రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న భీమునిగుమ్మానికి చెందిన కె.సాయి పట్టణంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. అదే ప్రాంతానికి చెందిన పి.యశోధభార్గవి పట్టణంలోని డీవీఎన్ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. భార్గవిని సాయి గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి విషయం పెద్దలకు తెలియడంతో రెండు కుటుంబాలకు చెందిన వారు పెద్దల సమక్షంలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. భార్గవి మైనర్ కావడంతో పెళ్లిని వాయిదా వేసినట్లుగా అక్కడివారు చెబుతున్నారు. ఈలోగా గత ఆరునెలలు నుంచి సాయి తాను ప్రేమించిన భార్గవితో ఘర్షణకు దిగేవాడని తెలిసింది. దీనికి ప్రధాన కారణం భార్గవి మరో వ్యక్తితో చనువుగా ఉండడమే. ఇదే విషయమై ఆమెను తరచూ నిలదీసేవాడు. అయినప్పటికీ మూడో వ్యక్తితో ఆమె చనువుగా ఉండడాన్ని తట్టుకోలేని సాయి ఉన్మాదిగా మారాడు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో కళాశాల నుంచి వస్తున్న భార్గవిపై ఒక్కసారిగా దాడికి దిగాడు. కూరగాయల కోసే కత్తి పట్టుకొని భార్గవి మెడపైన, పక్కటెములకులపైన పొడవడంతో కుప్పకూలిపోయింది. ఈ సంఘటన స్వయంగా భార్గవి తాతకు సంబంధించిన పాన్‌షాపు ఎదురుగా జరగడంతో ఆయన షాక్‌కు గురయ్యాడు. సంఘటన జరిగిన కొద్ది క్షణాలకే అక్కడ గుమిగూడిన జనమంతా సాయిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ ఎస్సై చక్రధర్, స్వీటీ, సావిత్రి, ట్రాఫిక్ ఎస్సై స్వామినాయుడు సంఘటనా స్థలానికి వచ్చి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. అంతేకాకుండా భార్గవిపై సాయి దాడి చేసిన సమయంలో రెండు కుటుంబాలకు చెందిన కొందరు అదే దుకాణం వద్ద ఉండడం గమనార్హం. సాయిని అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఎస్సై చక్రధర్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తును ప్రారంభించారు. భార్గవిని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. ఈ దాడితో తీవ్రశోకంలోకి మునిగిపోయిన భార్గవి తల్లి నూకరత్నం కన్నీరుమున్నీరవుతూ పడిపోయింది. ఇద్దరికీ పెళ్లి చేయాలని పెద్దల సమక్షంలో నిర్ణయించామని, ముక్కపచ్చలారని తన కుమార్తెపై దాడి చేసిన సాయిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఒక్కసారిగా ఈ ఘటనతో అనకాపల్లి ప్రాంతం ఉలిక్కిపడింది. ఈ సమాచారం జిల్లా మొత్తం సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రశాంతమైన అనకాపల్లి పట్టణంలో ఈతరహా సంఘటన ఎప్పుడూ చూడలేదని పురపెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. సాయి తండ్రి శ్రీను అనకాపల్లి శారదానదికి ఆనుకొని ఉన్న శ్మశానవాటిక కాపరిగా పని చేస్తున్నాడు. యశోధ భార్గవి తండ్రి కృష్ణ కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి ఉమా నూకరత్నం గృహిణి. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరి మధ్య జరిగిన ప్రేమాయణం ఇంతటి విషాదఘటనకు దారితీయడం పట్ల భీమునిగుమ్మం వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు మహిళా సంఘాలు ఈ ఘటనను ఖండిస్తూ సాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన భార్గవికి ప్రథమచికిత్స చేసిన అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. నివేదిక కోరిన ఏయూ వీసీ ఏయూ క్యాంపస్(విశాఖ తూర్పు): విద్యార్థినిపై అనకాపల్లిలో జరిగిన దాడి ఘటనపై ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నివేదిక కోరారు. డీవీఎన్ కళాశాల విద్యార్థినిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జరిగిన సంఘటనపై సత్వరమే తనకు నివేదిక అందించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. విద్యార్థినుల రక్షణకు, భద్రతకు ప్రాధాన్యమిస్తామన్నారు. త్వరలో వర్సిటీ అనుబంధ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి తగిన మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. మరోవైపు వీసీ ఆదేశాల మేరకు వర్సిటీ రెక్టార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ డీవీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ కె.రమేష్‌తో మాట్లాడారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కళాశాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో సంఘటన జరిగిందని, విద్యార్థిని ప్రాణాపాయం నుంచి బయటపడిందని ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రిన్సిపాల్‌కు రిజిస్ట్రార్ సూచించారు. పెళ్లికి నిరాకరించడంతోనే ఈ దుశ్చర్య? ఒకే ప్రాంతం, ఒకే సామాజికవర్గానికి చెందిన సాయి, భార్గవిలకు పెద్దల సమక్షంలో పెళ్లి చేయాలని కొద్ది నెలలు క్రితం నిర్ణయించారు. నెల క్రితం సాయి సోదరికి వివాహం కూడా జరిగింది. అయితే భార్గవి అదే ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తితో చనువుగా ఉంటుందని భావించి అనుమానంతో సాయి గాయాలపాలైన భార్గవిని నిలదీసేవాడు. ఇలా వీరిద్దరి మధ్య తరచూ వివాదం జరగడంతో నెలరోజుల క్రితం భార్గవి కుటుంబీకులు సాయి ఇంటికి వెళ్లి మీ అబ్బాయి మా అమ్మాయిని వేధిస్తున్నందున పెళ్లి వాయిదా వెద్దామని చెప్పినట్లుగా సమాచారం. దీంతో మరింత మానసిక ఉన్మాదానికి గురైన సాయి గత కొద్దిరోజుల నుంచి భార్గవితో వాదులాటకు దిగేవాడు. ఇక మానసికమైన ఉద్వేగానికి గురై ప్రేమోన్మాదిగా మారిన సాయి తట్టుకోలేక భార్గవిపై కత్తితో దాడి చేశాడు. సాయిపై 307, 506, 509 సెక్షన్లు నమోదు యువతి భార్గవిపై హత్యాయత్నానికి పాల్పడిన సాయిపై 307, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అనకాపల్లి పట్టణ ఎస్సై చక్రధరరావు పేర్కొన్నారు. కేజీహెచ్‌కు భార్గవి భార్గవికి మెడపై, పక్కటెముకుల్లో కత్తిపోట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించాం. ప్రాణానికి ఎటువంటి హానీ లేదు. – జగన్మోహనరావు, ఎన్టీఆర్ వైద్యాలయం సూపరింటెండెంట్ ఎంతటి వారైనా కఠిన చర్యలు ప్రశాంతమైన అనకాపల్లి పట్టణంలో ఎప్పుడు ఇటువంటి దారుణ ఘటనలు జరగలేదు. ఈ హత్యాయత్నం కేసులో నిందితుడు ఎంతటివారైనా కఠిన శిక్ష తప్పదు. గాయపడిన బాలికకు తగిన వైద్య చికిత్స అందిస్తాం. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. –గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే ఎంత ఘోరం చేశాడు మా కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాం. మా ఇంటికి దగ్గరలోనే ఉన్న సాయి ఇంత ఘోరానికి పాల్ప డతాడని అనుకోలేదు. వీరిద్దరికీ పెళ్లి చేద్దామని రెండు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో నిర్ణయించాం. ఇంతలోనే దాడికి తెగబడిన సాయిని కఠినంగా శిక్షించాలి. సాయిపై 307, 506, 509 సెక్షన్లు నమోదు యువతి భార్గవిపై హత్యాయత్నానికి పాల్పడిన సాయిపై 307, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అనకాపల్లి పట్టణ ఎస్సై చక్రధరరావు పేర్కొన్నారు. కేజీహెచ్‌కు భార్గవి భార్గవికి మెడపై, పక్కటెముకుల్లో కత్తిపోట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించాం. ప్రాణానికి ఎటువంటి హానీ లేదు. – జగన్మోహనరావు, ఎన్టీఆర్ వైద్యాలయం సూపరింటెండెంట్ -
బాటిల్ తెచ్చిన వివాదం.. ముగ్గురు బలి
న్యూఢిల్లీ : అసహనం, కోపం మనిషి చేత ఎలాంటి పనులు చేయిస్తాయో ఇది చదివితే అర్థమవుతుంది. ఇరుగుపొరుగు ఇళ్ల మధ్య వచ్చిన ఓ చిన్న వివాదం ముగ్గుర్ని బలిగింది. వివరాలు.. ఢిల్లీలో ఉంటున్న ఆజాద్(40), వీరు(41) పక్క పక్క ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వీరు కూతురు ఓ బాటిల్‌ను తమ ఇంటి బాల్కనీ నుంచి రోడ్డు మీదకు విసిరింది. అయితే దురదృష్టవషాత్తు అది వెళ్లి రోడ్డు మీద నిల్చున్న ఆజాద్‌కు తగిలింది. దాంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. చివరకు ఎలాగోలా ఆ వివాదం కాస్తా సద్దుమణిగింది. ఈ క్రమంలో బధవారం రాత్రి ఇరు కుటుంమాల మధ్య మరోసారి తగాద ప్రారంభమయ్యింది. ఈ వివాదం కాస్తా ముదరడంతో.. సహనం కోల్పోయిన ఆజాద్ కత్తి తీసుకుని వీరు కొడుకు మీద విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుకోబోయిన వీరు, అతని భార్య మీద కూడా దాడి చేశాడు. అనంతరం ఆజాద్ అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా.. వీరు భార్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. (వీరు భార్య, కుమారుడు (ఫైల్ ఫోటో)) ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరు, అతని కొడుకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇంత పెద్ద తగాద జరుగుతుంటే చుట్టుపక్కల ఉన్న వారు ఆపకపోగా.. దీన్నంతా తమ ఫోన్లలో వీడియో తీయడంలో బిజీ అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆజాద్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
భార్యను కలవనివ్వడం లేదని...
సాక్షి, న్యూఢిల్లీ : పుట్టింటికి వెళ్లిన భార్యను కలవనీయకుండా అడ్డుపడుతున్నాడనే నేపంతో పిల్లనిచ్చిన మామనే కత్తితో పొడిచి చంపాడు ఓ వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పు ఢిల్లీకి చెందిన నీరజ్ (27) ప్రైవేట్ ట్రావేల్ ఏజెన్సీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2016లో రాఖీ (25)తో వివాహం అయ్యింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో 2018, మార్చ్‌లో రాఖీ తన భర్త మీద గృహ హింస కేసు పెట్టింది. అప్పటి నుంచి రాఖీ శశిగార్డెన్‌లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ క్రమంలో నీరజ్ భార్యను తిరిగి కాపురానికి రావాల్సిందిగా కోరాడు. కానీ రాఖీ అందుకు నిరాకరించడంతో నీరజ్ బెదిరింపులకు దిగాడు. ఆదివారం నీరజ్ తన భార్యను కలవడానికి ఆమె పుట్టింటికి వెళ్లాడు. ఆ సమయంలో నీరజ్ మామ ప్రభు దయాల్ (45) తలుపు తీసి, నీరజ్‌ని ఇంట్లోకి రాకుండా అడ్డుకుని అతనితో గొడవ పడ్డాడు. సహనం కోల్పోయిన నీరజ్ తనతో పాటు తీసుకు వచ్చిన కత్తితో మామ ప్రభు దయాల్‌ను విచక్షణా రహితంగా పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ప్రభు దయాల్‌ను సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. నీరజ్ కేసు నమోదు చేసి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ పంకజ్ సింగ్ తెలిపారు. -
పెళ్లి రద్దు: యువతిపై కత్తితో దాడి!
సాక్షి, న్యూఢిల్లీ: తనతో పెళ్లిని రద్దు చేసుకున్నందుకు కక్షగట్టిన యువకుడు, ఓ యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడిచేశాడు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషయంగా ఉంది. ఈ ఘటన న్యూఢిల్లీలో కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి ఉంటే 21 ఏళ్ల యువతి ప్రైవేట్‌గా ట్యూషన్ చెబుతుండేది. ఈ క్రమంలో ఆ యువతికి వెస్ట్ ఢిల్లీ జఖీరాకు చెందిన లక్కీ అనే యువకుడితో గతేడాది నిశ్చితార్థం జరిగింది. ఈ జనవరి 30న వీరి వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు. కానీ యువకుడికి తాగుడు అలవాటు ఉందని, తాగొచ్చి చుట్టుపక్కల వాళ్లతో ఎప్పుడూ గొడవకు దిగేవాడని వధువు ఫ్యామిలీకి తెలిసింది. దీంతో లక్కీకి తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేది లేదని వధువు కుటుంబం తేల్చి చెప్పింది. పెళ్లి ఆగిపోవడంతో నిందితుడు లక్కీ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతిని వేధించే లక్కీ గత శనివారం (ఫిబ్రవరి 24) ఆవేశంతో అమ్మాయి ఇంటికి వచ్చాడు. కుటుంబీకులు చూస్తుండగానే యువతిని వంటింట్లోకి లాక్కెళ్లి కత్తితో పలుమార్లు పొడిచాడు. అదే సమయంలో యువతి తండ్రి తలుపులు పగలగొట్టి చూసేసరికి అమ్మాయి తీవ్ర రక్తంతో స్పృహ కోల్పోయి ఉన్నట్లు గుర్తించాడు. నిందితుడు లక్కీని అడ్డుకుని అతడి చేతిలోని కత్తిని బాధితురాలి తండ్రి లాక్కున్నారు. వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరాయ్యాడు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు లక్కీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
ఫ్రెండ్ అని కూడా చూడకుండా పొడిచేశాడు
ముంబయి: సోషల్ మీడియాలో సరదాగా సాగిన సంభాషణ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. తాము స్నేహితులం అనే విషయం కూడా మరిచి ఇద్దరు యువకులు కొట్టుకున్నారు. వాట్సాప్ గ్రూప్‌లో తనను అవమానించాడనే ఆగ్రహంతో మరో మిత్రుడు కత్తితో తన స్నేహితుడిని పొడిచాడు. దీంతో అతడి పొట్టలోకి ఐదు అంగుళాల మేర కత్తి దిగింది. అతడిని సమీపంలోని ఆస్పత్రిలోకి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే, ముంబయిలోని దాదార్ ప్రాంతంలో మనీశ్ షా (26) అనే యువకుడు తన తండ్రితో కలిసి తమ స్టీల్ పాలిషింగ్ కంపెనీకి వెళ్తుంటాడు. అతడు శ్రేయాస్ నవాల్కర్(21) అనే మరో యువకుడు స్నేహితులు. నవాల్కర్ ప్రొడక్షన్ డిజైన్ స్టూడెంట్. వాళ్లు వాట్సాప్‌లో తొలుత సరదా సంభాషణ మొదలు పెట్టారు. అది కాస్త ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకునే వరకు వెళ్లింది. ఇంకా ముదిరి ఒకరికొకరు ఎదురుపడితే తన్నుకునే చచ్చేంత తీవ్ర స్థాయి వరకు సాగింది. సరిగ్గా మధ్యాహ్నం 3.20గంటల ప్రాంతంలో తన బైక్ పై కోపంతో బయటకు వెళ్లిన మనీశ్ షా నాజ్ సినిమా కాంపౌండ్‌లో నవాల్కర్ను కత్తితో పొడిచి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
కొడుకును పొడిచి చంపిన తండ్రి
లక్నో: మద్యం మత్తు ఎంతటి దారుణానికైనా దారి తీస్తుందనడానికి ఉదాహరణ ఈ సంఘటన. తాగిన మత్తులో చేతికి అంది వచ్చిన కొడుకుని దారుణంగా హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఉత్తర ప్రదేశ్ సంబాల్ జిల్లా లో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం తుర్తిపూర్ గ్రామానికి చెందిన ఆర్కాన్ ఫూటుగా మద్యం సేవించి వచ్చి భార్యను కొట్టడం ప్రారంభించాడు. ఇది చూసిన కొడుకు ఫైజన్ తట్టుకోలేకపోయాడు. తల్లిపై దాడి చేస్తున్న తండ్రిని అడ్డుకున్నాడు. అంతే విచక్షణ మరిచిన ఆర్కాన్... కొడుకును కత్తితో పలుమార్లు పొడిశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన ఫైజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. -
అమ్మో.. రెప్పపాటులో కత్తి పోటు తప్పింది
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ దొంగ దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఓ షాపు ముందు కాపలాగా నిద్రిస్తున్న వ్యక్తిని అమాంతం పొడిచిచంపేందుకు ప్రయత్నించాడు. దొంగ అలికిడిని రెప్పపాటులో గమనించిన కాపలా వ్యక్తి స్వల్పగాయంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ తప్పించుకున్నాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో ప్రకారం ఢిల్లీలోని చాందీ చౌక్ ఏరియాలో ఓ స్టేర్ పై దుకాణం ఉంది. దాని ముందే సెక్యూరిటీ గార్డు నిద్రపోయాడు. రాత్రి సమయం కావడంతో అక్కడి మెట్లు ఎక్కి దొంగతనానికి మంకీ టీ షర్ట్ లో వచ్చిన దొంగ అక్కడ గార్డును చూసి తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తిని బయటకు తీశాడు. రెండు చేతులతో దాని పిడిని గట్టిగా పట్టుకున్నాడు. రెండుమూడుసార్లు కిందికి వంగి చూసి కాళ్లు, తల భాగం ఎటువైపు ఉందా అని పరిశీలించాడు. ఆ తర్వాత పైకి లేచి ఊపిరి బిగబట్టి గట్టిగా పొడిచేసే ప్రయత్నం చేశాడు. రెప్పపాటు ఆ గార్డు ఆ పోటు నుంచి తప్పించుకుని స్వల్పగాయాలతో మెట్లపై నుంచి దొర్లుతూ ఆ ప్రాంతం నుంచి పరుగెత్తాడు. దీంతో దొంగ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. టీనేజీ యువకుడిలాగే ఉన్న ఆ దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సూది సైకో మరో దాడి
పశ్చిమగోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలో సూదిసైకో మళ్లీ కలకలం సృష్టించాడు. ఈ ఘటన జిల్లాలోని పెంటపాడు మండలం జెట్లపాలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని జెట్లపాలెం గ్రామానికి చెందిన ఏ. బ్రహ్మం(30) అనే వ్యక్తిపై ముసుగు ధరించిన వ్యక్తి ఇంజక్షన్‌తో దాడి చేసి పారిపోయాడు. బాధితుడిని కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తరిలించగా చికిత్స పొందుతున్నాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై దుండగుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.