సూది సైకో మరో దాడి
పశ్చిమగోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలో సూదిసైకో మళ్లీ కలకలం సృష్టించాడు. ఈ ఘటన జిల్లాలోని పెంటపాడు మండలం జెట్లపాలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని జెట్లపాలెం గ్రామానికి చెందిన ఏ. బ్రహ్మం(30) అనే వ్యక్తిపై ముసుగు ధరించిన వ్యక్తి ఇంజక్షన్‌తో దాడి చేసి పారిపోయాడు.
బాధితుడిని కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తరిలించగా చికిత్స పొందుతున్నాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై దుండగుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.