syringe psycho
-
నగరంలో సూది సైకో కలకలం
వనస్థలిపురం: నగరంలో మరో మారు సూది సైకో రెచ్చిపోయాడు. బైక్ పై వెళ్తున్న మహిళ పై సూదితో దాడి చేసి పరారయ్యాడు. ఈ సంఘటన వనస్థలిపురం పరిధిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రమాదేవి(38) అనే మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగుడు సూదితో దాడి చేశాడు. ఇది గుర్తించిన ఆమె కేకలు వేసే లోపే దుండగుడు అక్కడి నుంచి ఉడాయించాడు. సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ పుటెజ్ లను పరిశీలిస్తున్నారు. రమాదేవి ఓ కాలేజ్ లో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. -
నగరంలో సూది సైకో కలకలం
-
నిజాంపేటలో సూదిసైకో కలకలం
కూకట్పల్లి పరిధిలోని నిజాంపేటలో మంగళవారం సూదిసైకో కలకలం రేపాడు. ఉదయం బహిర్భూమికి వెళ్తున్న శేఖర్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి సూదితో దాడి చేసి పరారయ్యాడు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
చిన్నారిపై సిరంజి సైకో దాడి!
- బైక్‌పై వచ్చి సూదితో గుచ్చి పరారీ - హైదరాబాద్ మల్కాజిగిరిలో ఘటన హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలను వణికిస్తున్న ‘సిరంజి’ సైకో తరహా దాడి హైదరాబాద్‌లోనూ చోటుచేసుకుంది! తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ అగంతకుడు ఇంజక్షన్ సూదితో గుచ్చి పరారైన ఘటన నగరంలోని మల్కాజిగిరిలో శనివారం ఉదయం జరిగింది. మల్కాజ్గిరి పరిధిలోని ఇందిరానెహ్రూ నగర్‌కు చెందిన యాదగిరి, లావణ్య దంపతుల కుమార్తె రమ్య (9). స్థానికంగా ఉన్న న్యూ లిల్లీ మోడల్ స్కూల్లో నాల్గో తరగతి చదువుతుంది. శనివారం గురు పూజోత్సవం కావ డంతో ఉపాధ్యాయులకు గిఫ్ట్ కొనడానికి స్కూలుకు సమీపంలో ఉన్న ఓ దుకాణానికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి స్కూల్‌కి వస్తుండగా ద్విచక్ర వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రమ్య కుడి చేతికి ఇంజక్షన్ సూదితో గుచ్చి పారిపోయాడు. దీంతో నొప్పి అనిపించి బాలిక వెనక్కి తిరిగి చూడగా నల్లరంగు ప్యాంట్, ఆకుపచ్చ రంగు షర్ట్ వేసుకున్న సైకో అక్కడి నుంచి ఉడాయించాడు. విషయం టీచర్లకు తెలియడంతో ఆమెను చికిత్స కోసం స్థానిక ఎల్కే ఆస్పత్రికి తరలించారు. బాలికకు ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు స్పష్టం చేశారు. తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఘటనా స్థలాన్ని, పాఠశాలల్లోని సీసీ ఫుటేజీలను మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ శేఖర్‌గౌడ్ పరిశీలించారు. ఫుటేజీల్లో ఎలాంటి దృశ్యాలు నమోదు కాలేదని, విద్యార్థిని విచారించగా పొంతన లేని సమాధానం చెబుతోందని తెలిపారు. బాలిక చేతికి గుచ్చింది ఇంజక్షన్ నీడిలా? లేక గుండు పిన్నా ? అనేది నిర్ధారించాల్సి ఉందన్నారు. -
హైదరాబాద్‌లో సైకో సూదిగాడు
-
హైదరాబాద్‌లో సైకో సూదిగాడు...
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా వాసులను వణికిస్తున్న ఇంజక్షన్ దాడులు హైదరాబాద్ కూ పాకాయి. మల్కాజ్‌గిరిలో నాలుగో తరగతి విద్యార్థిని రమ్యపై ఇంజక్షన్ దాడి జరిగింది. శనివారం ఉదయం రమ్య స్కూల్‌కి వెళ్తున్న సమయంలో... బైక్‌పై వచ్చిన ఆగంతకుడు ఆమెకు ఇంజక్షన్ గుచ్చి పరారయ్యాడు. బాధితురాలు లిల్లీపుట్ మోడల్ స్కూల్లో చదువుతోంది. రమ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. కాగా ఇంజక్షన్ దాడులు ఇప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాను వణికిస్తున్నాయి. ఇంజక్షన్ దాడులకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేసిన ఫలితం శూన్యం. ఇప్పటి వరకూ ఆగంతకుడిని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా ఇంజక్షన్ దాడి స్థానికంగా కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మళ్లీ రెచ్చిపోయిన సిరంజీ సైకో
-
సూది సైకో మరో దాడి
పశ్చిమగోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలో సూదిసైకో మళ్లీ కలకలం సృష్టించాడు. ఈ ఘటన జిల్లాలోని పెంటపాడు మండలం జెట్లపాలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని జెట్లపాలెం గ్రామానికి చెందిన ఏ. బ్రహ్మం(30) అనే వ్యక్తిపై ముసుగు ధరించిన వ్యక్తి ఇంజక్షన్‌తో దాడి చేసి పారిపోయాడు. బాధితుడిని కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తరిలించగా చికిత్స పొందుతున్నాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై దుండగుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.