ఆ చేప చిక్కడమే విషాదం ... హఠాత్తుగా మీదకు దూకి... | 73 Year Old Woman Stabbed By Sailfish That Leaped Out Of Water | Sakshi
Sakshi News home page

అబ్బా చేప చిక్కింది అనుకునేలోపే ... హఠాత్తుగా దాడి చేసి...

Jul 25 2022 2:17 PM | Updated on Jul 25 2022 3:38 PM

73 Year Old Woman Stabbed By Sailfish That Leaped Out Of Water  - Sakshi

ముగ్గురు మహిళలు ఒక పడవలో చేపల వేటకు వెళ్లారు. పాపం వారు ఎంతో కష్టబడి దాదాపు 45 కిలోల సెయిల్‌ ఫిష్‌ని పట్టుకున్నారు. అంతే తర్వాత వారు చాలా ఆనందంగా ఆ చేపను ఫిషింగ్‌ ట్రైలోకి వేయడం కోసం నీటి నుంచి పైకి లాగుతున్నారు. అంతే అది అనుహ్యంగా వారి మీదకు ఒక్క ఊదుటన దాడి చేసింది. ఈ ఆకస్మిక ఘటనలో..

ఫ్లోరిడాలోని ముగ్గురు మహిళలు 100 పౌండ్ల (దాదాపు 45 కిలోల) సెయిల్‌ ఫిష్‌ని పట్టుకున్నారు. హమ్మయ్య అంటూ ఆనందంగా నీటి నుంచి పైకి తీస్తుండగా ఒక్కసారిగా అనుహ్య ఘటన చోటుచేసుకుంది. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

అసలేం జరిగిందంటే...ముగ్గురు మహిళలు ఒక పడవలో చేపల వేటకు వెళ్లారు. పాపం వారు ఎంతో కష్టబడి దాదాపు 45 కిలోల సెయిల్‌ ఫిష్‌ని పట్టుకున్నారు. అంతే తర్వాత వారు చాలా ఆనందంగా ఆ చేపను ఫిషింగ్‌ ట్రైలోకి వేయడం కోసం నీటి నుంచి పైకి లాగుతున్నారు. అంతే అది అనుహ్యంగా వారి మీదకు ఒక్క ఊదుటన దాడి చేసింది. ఈ ఆకస్మిక ఘటనలో వారి పక్కన ఉన్న కేథరిన్‌ పెర్కిన్స్‌ అనే 73 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడింది.

దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సదరు స్నేహితులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆమె పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. సెయిల్‌ ఫిష్‌ అనేది అత్యంత వేగవంతమైన చేప జాతులలో ఒకటి. ఇవి సమద్రం అడుగు భాగాన డీప్‌గా సంచరించేవిగానూ, అత్యంత బలంగా దాడి చేసే చేపలగానూ ప్రసిద్ధి.

(చదవండి: అరుదైన ఘటన: రోబోతో చెస్‌ ఓపెన్‌... గాయపడిన చిన్నారి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement