Sailfish
-
ఆ చేప చిక్కడమే విషాదం ... హఠాత్తుగా మీదకు దూకి...
ఫ్లోరిడాలోని ముగ్గురు మహిళలు 100 పౌండ్ల (దాదాపు 45 కిలోల) సెయిల్ ఫిష్‌ని పట్టుకున్నారు. హమ్మయ్య అంటూ ఆనందంగా నీటి నుంచి పైకి తీస్తుండగా ఒక్కసారిగా అనుహ్య ఘటన చోటుచేసుకుంది. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అసలేం జరిగిందంటే...ముగ్గురు మహిళలు ఒక పడవలో చేపల వేటకు వెళ్లారు. పాపం వారు ఎంతో కష్టబడి దాదాపు 45 కిలోల సెయిల్ ఫిష్‌ని పట్టుకున్నారు. అంతే తర్వాత వారు చాలా ఆనందంగా ఆ చేపను ఫిషింగ్ ట్రైలోకి వేయడం కోసం నీటి నుంచి పైకి లాగుతున్నారు. అంతే అది అనుహ్యంగా వారి మీదకు ఒక్క ఊదుటన దాడి చేసింది. ఈ ఆకస్మిక ఘటనలో వారి పక్కన ఉన్న కేథరిన్ పెర్కిన్స్ అనే 73 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సదరు స్నేహితులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆమె పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. సెయిల్ ఫిష్ అనేది అత్యంత వేగవంతమైన చేప జాతులలో ఒకటి. ఇవి సమద్రం అడుగు భాగాన డీప్‌గా సంచరించేవిగానూ, అత్యంత బలంగా దాడి చేసే చేపలగానూ ప్రసిద్ధి. (చదవండి: అరుదైన ఘటన: రోబోతో చెస్ ఓపెన్... గాయపడిన చిన్నారి) -
కొత్త ఓఎస్‌తో నయా మొబైల్
హెల్సింకి/న్యూఢిల్లీ: కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ సెయిల్ ఫిష్‌తో తయారైన తొలి ఫోన్ ఈ నెల 27న మార్కెట్లోకి రానున్నది. మొబైల్ దిగ్గజం నోకియా నుంచి బయటకు వచ్చిన కొంతమంది కలసి జొల్లా కంపెనీని ఏర్పాటు చేశారు. వీరంతా ఈ కొత్త ఓఎస్, సెయిల్ఫిష్ను డెవలప్ చేస్తున్నారు. ఫిన్లాండ్కు చెందిన మొైబె ల్ ఆపరేటర్ డీఎన్ఏ భాగస్వామ్యంతో ఈ జొల్లా ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నామని జొల్లా కంపెనీ వెబ్సైట్ తెలిపింది. ఈ వెబ్సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం.., 4.5 అంగుళాల డిస్ప్లే ఉన్న ఈ ఫోన్లో 8 మెగా పిక్సెల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్ ధర 399 యూరోలు(సుమారుగా రూ.34,000) ఉండొచ్చు.