కొత్త ఓఎస్‌తో నయా మొబైల్
హెల్సింకి/న్యూఢిల్లీ: కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ సెయిల్ ఫిష్‌తో తయారైన తొలి ఫోన్ ఈ నెల 27న మార్కెట్లోకి రానున్నది. మొబైల్ దిగ్గజం నోకియా నుంచి బయటకు వచ్చిన కొంతమంది కలసి జొల్లా కంపెనీని ఏర్పాటు చేశారు. వీరంతా ఈ కొత్త ఓఎస్, సెయిల్‌ఫిష్‌ను డెవలప్ చేస్తున్నారు. ఫిన్లాండ్‌కు చెందిన మొైబె ల్ ఆపరేటర్ డీఎన్‌ఏ భాగస్వామ్యంతో ఈ జొల్లా ఫోన్‌లను అందుబాటులోకి తెస్తున్నామని జొల్లా కంపెనీ వెబ్‌సైట్ తెలిపింది. ఈ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం.., 4.5 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్‌లో 8 మెగా పిక్సెల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్ ధర 399 యూరోలు(సుమారుగా రూ.34,000) ఉండొచ్చు.