మనుషుల వికృత ప్రవర్తనలకు తగ్గట్టుగానే వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఇదేం వ్యాధిరా బాబు అని ముక్కుమీద వేలేసుకునేలా ఉన్నాయి వాటి పేర్లు. కోపంతో మరో మనిషిని చంపడం ఒక తరహ అయితే..అదే చికాకు కోపంతో తనను తాను చంపేసుకునేలా ప్రేరేపిస్తుంది ఈ వ్యాధి. ఆ తర్వాత ఆ వ్యక్తికి తాను చేసిందేంది గుర్తుండదట. తనపై ఎవరో దాడి చేసినట్లు లేదా ప్రమాదం జరిగినట్లు భావిస్తారట. వాస్తవం వివరించిన వారికి అదేమీ గుర్తుండదట. చూడ్డానికి టీవీల్లో చూసే చేతబడి మాదిరిగా లేదా దెయ్యంలాంటి వ్యాధిలా ఉంటుంది. ఈ వింత వ్యాధి బారినపడ్డ మహిళ స్థితి గురించే ఈ కథనం!.
బ్రిటన్‌కి చెందని 41 ఏళ్ల షార్లెట్ హెవిట్ ఉన్నటుండి ఆస్పత్రి పాలయ్యింది. ఆమె భర్త హుటాహుటినా ఆస్పత్రికి తీసుకురావడంతో త్రుటిలో ప్రాణాలతో బయటపడింది. ఆ టైంలో ఆమె సుమారు ఒక వారం వరకు పూర్తి కోమాలో ఉంది. పైగా తాను ఎందుకు ఆస్పత్రిలో ఉన్నానని, ఏం జరిగిందని ఎదురు ప్రశ్నించడంతో ఆమె భర్తతో సహా వైద్యులు సైతం కంగుతిన్నారు. దీంతో వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి ఆమెక హంటిగ్టన్‌స్ వ్యాధితో బాధపడుతున్నట్లు తేల్చారు. ఈ వ్యాధి కారణంగా ఉన్నట్లుండి ఆమె ఒక విధమైన ఉద్వేగానికిలోనై తనను తాను హాని చేసుకునులా వింతగా ప్రవర్తిస్తుందని చెప్పారు.
ఇది మెదడులోని భాగాలను నెమ్మది నెమ్మదిగా పనిచేయకుండా నిలిపేసి మానిసికంగా దెబ్బతినేలా చేస్తుంది. ఒక విధంగా సైకోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ మేరకు ఆమె భర్త మాట్లాడుతూ..తన భార్య షార్లెట్ ఆరోజు సడెన్‌గా గదిలోపలకి వచ్చి గట్టిగా అరుస్తూ.. కత్తితో తనను తాను గట్టిగా పొడుచుకుందని చెప్పుకొచ్చాడు. ఈ హఠాత్పరిణామానికి తనకేం పాలిపోలేదని వాపోయాడు. కానీ ఇప్పుడేమో ఆమె తనకేమైందని ప్రశ్నిస్తుంటే చాలా గందరగోళంగా ఉందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఈ అసంఘటిత చర్య కారణంగా వైద్యులు ఆమెకు మూడుసార్లు సర్జరీ చేశారు. ఆమె పొట్టలోని ప్రేగుల్లో పావు వంతు దాక డ్యామేజ్ కాకుండా కాపాడారు.
ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఈ హంటిగ్టన్‌స్ వ్యాధి అనేది వారసత్వంగా వచ్చే రుగ్మత. దీని వలన మెదడులోని కొన్ని భాగాల్లో నరాలు క్రమక్రమంగా విఛ్చిన్నమై పోతాయి. ఫలితంగా మెదడులోని ఇతర ప్రాంతాల్లోని కదలికలను నియంత్రించే అవయవాల పనితీరు మార్పు వచ్చి.. జ్ఞాపక శక్తిని కోల్పోవడం, నిరాశ నిస్ప్రుహలకు లోనై వికృతంగా మారిపోవడం జరుగుతుంది. ఇవే ఈ వ్యాధి ప్రదాన లక్షణాలు. ఈ వ్యాధి బారినపడ్డవారి శరీరంలో అసంకల్పిత కుదుపు లేదా చంచలమైన కదలికలు సడెన్‌గా వస్తాయి. షార్లెట్ తాను ఇలా 2014లో 23 ఏళ్ల వయసులో ఇలాంటి స్థితిలోనే ఉన్నాని చెప్పుకొచ్చింది.
అయినప్పటకీ తాను జీవితాన్ని కొనసాగించగలిగానని, మళ్లీ ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నానని వాపోయింది. ఈ వ్యాధి కారణంగా కుక్కును పార్క్‌లో వదిలేయడం, గ్యాస్ ఆఫ్ చేయడం మరచిపోవడం తదితర ఎన్నో సంఘటనలు జరిగాయని, ఇవే తనను నిరాశలోకి నెట్టేసి తనను తాను గాయపరుచుకునేలా ప్రేరేంపించాయని వెల్లడించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధికి ఎలాంటి నివారణ లేదు. కానీ రోగులు మానసిక ఆరోగ్యానికి సత్వరమే చికిత్స తీసుకుంటే నయం అవుతుందని చెబుతున్నారు. ఈ వ్యాధి వస్తే తొలుత రోజు వారీ జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయదు. కానీ క్రమేణా సాధారణ పనులను సైతం సొంతంగా చేసుకోలేని ధీనస్థితికి వచ్చేస్తారు.
ఈ వ్యాధికి గల కారణం..
ఈ వ్యాధిగ్రస్తుల డీఎన్‌ఏ ఈ హంటింగ్‌టిన్‌స్ ప్రోటీన్‌ని తయారు చేయడానికి కావాల్సిన సమాచారాన్ని నిల్వ చేయదు. ఫలితంగా అవి అసాధారణ ఆకారంలో పెరిగా మెదడులోని న్యూరాన్‌లను నాశనం చేస్తాయి. దీంతో శరీర కదలికలను నియంత్రించే మెదడులోని బేసల్ గాంగ్లియాలో నరాలు నాశనం అవ్వడం జరుగుతుంది. ఫలితంగా ఆలోచన, నిర్ణంయ తీసుకోవడం, జ్ఞాపకశక్తి తదితర పనులు నిర్వహించే మెదడు పనితీరుని ప్రభావితం చేసి సడెన్‌గామనిషిని ఓ ఉన్మాదిలా మారుస్తుంది.
(చదవండి: రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి హెచ్‌ఐవీ ఫిజీషియన్ ఆయన!)
Comments
Please login to add a commentAdd a comment