పెళ్లి రద్దు: యువతిపై కత్తితో దాడి! | A Man stabs woman due to cancelling marriage with him | Sakshi
Sakshi News home page

పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న యువతిపై కత్తితో దాడి!

Published Mon, Feb 26 2018 2:02 PM | Last Updated on Mon, Feb 26 2018 3:23 PM

A Man stabs woman due to cancelling marriage with him - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తనతో పెళ్లిని రద్దు చేసుకున్నందుకు కక్షగట్టిన యువకుడు, ఓ యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడిచేశాడు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషయంగా ఉంది. ఈ ఘటన న్యూఢిల్లీలో కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

తల్లిదండ్రులతో కలిసి ఉంటే 21 ఏళ్ల యువతి ప్రైవేట్‌గా ట్యూషన్ చెబుతుండేది. ఈ క్రమంలో ఆ యువతికి వెస్ట్ ఢిల్లీ జఖీరాకు చెందిన లక్కీ అనే యువకుడితో గతేడాది నిశ్చితార్థం జరిగింది. ఈ జనవరి 30న వీరి వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు. కానీ యువకుడికి తాగుడు అలవాటు ఉందని, తాగొచ్చి చుట్టుపక్కల వాళ్లతో ఎప్పుడూ గొడవకు దిగేవాడని వధువు ఫ్యామిలీకి తెలిసింది. దీంతో లక్కీకి తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేది లేదని వధువు కుటుంబం తేల్చి చెప్పింది. పెళ్లి ఆగిపోవడంతో నిందితుడు లక్కీ యువతిని వేధించడం మొదలుపెట్టాడు.

తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతిని వేధించే లక్కీ గత శనివారం (ఫిబ్రవరి 24) ఆవేశంతో అమ్మాయి ఇంటికి వచ్చాడు. కుటుంబీకులు చూస్తుండగానే యువతిని వంటింట్లోకి లాక్కెళ్లి కత్తితో పలుమార్లు పొడిచాడు. అదే సమయంలో యువతి తండ్రి తలుపులు పగలగొట్టి చూసేసరికి అమ్మాయి తీవ్ర రక్తంతో స్పృహ కోల్పోయి ఉన్నట్లు గుర్తించాడు. నిందితుడు లక్కీని అడ్డుకుని అతడి చేతిలోని కత్తిని బాధితురాలి తండ్రి లాక్కున్నారు. వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరాయ్యాడు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు లక్కీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement