కొడుకును పొడిచి చంపిన తండ్రి | Man stabs son to death Sambhal | Sakshi
Sakshi News home page

కొడుకును పొడిచి చంపిన తండ్రి

Published Sat, Apr 16 2016 11:38 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Man stabs son to death Sambhal

లక్నో: మద్యం మత్తు ఎంతటి  దారుణానికైనా దారి  తీస్తుందనడానికి   ఉదాహరణ ఈ సంఘటన. తాగిన మత్తులో చేతికి అంది వచ్చిన  కొడుకుని దారుణంగా  హత్య చేశాడు ఓ  ప్రబుద్ధుడు.  ఉత్తర ప్రదేశ్  సంబాల్ జిల్లా లో  శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం తుర్తిపూర్ గ్రామానికి చెందిన ఆర్కాన్ ఫూటుగా మద్యం సేవించి వచ్చి భార్యను కొట్టడం ప్రారంభించాడు. ఇది చూసిన కొడుకు  ఫైజన్ తట్టుకోలేకపోయాడు. తల్లిపై  దాడి చేస్తున్న తండ్రిని అడ్డుకున్నాడు. అంతే  విచక్షణ మరిచిన ఆర్కాన్... కొడుకును కత్తితో పలుమార్లు పొడిశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన ఫైజన్  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement