సాక్షి, న్యూఢిల్లీ: చాందినీచౌక్ మెయిన్ రోడ్ వన్‌వేగా మారనుంది. సోమవారం నుంచి అమలులోకి వస్తుంది. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసు జాయింట్ కమిషనర్ అనిల్ శుక్లా వెల్లడించారు. ఎర్రకోట నుంచి టౌన్‌హాల్, ఫతేపురి మసీదు వైపు ట్రాఫిక్‌ను అనుమతిస్తారు. కానీ వ్యతిరేకదిశలో వాహనాలను అనుమతించరు. తిరిగి వెళ్లేవారు శ్యామా ప్రసాద్ ముఖర్జీ మార్గ్ అంటే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ ముందు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఎర్రకోట చౌక్ నుంచి ఫతేపురి మసీదు వరకు ట్రాఫిక్ ఇకపై సదరన్ కేరేజ్‌వే గుండా వెళుతుంది. మొత్తం చాందినీచౌక్ మెయిన్ రోడ్ వన్‌వేగా మారుతోంది.
సైనేజీల ఏర్పాటు
వన్ వే గురించి వాహనచోదకులకు సమాచారం అందించడం కోసం చాందినీచౌక్ వద్ద పీడబ్ల్యూడీ పలుచోట్ల మ్యాపులు , సైనేజీలు ఏర్పాటు చేసింది. ఇందుకోసం ట్రాఫిక్ సిబ్బందిని తగిన సంఖ్యలో మోహరించనున్నారు. చాందినీ చౌక్ మెయిన్ రోడ్ సదరన్ క్యారేజ్‌పై వాహనాల పార్కింగ్‌ను అనుమతించరు. వాహనాలను నిలిపి సరుకులు దింపడాన్ని ఎక్కించడాన్ని కూడా అనుమతించరు. అక్రమంగా పార్క్ చేస వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొంటారు. అటువంటి పార్కింగ్‌లపై రూ.600 జరిమానా విధిస్తారు.
చురుగ్గా రోడ్డు అభివృద్ధి పనులు
పీడబ్ల్యూడీ చాందినీచౌక్ అభివృద్ధి పనులు జరుపుతున్నందు వల్ల చాందినీచౌక్ మెయిన్‌రోడ్‌ను వన్‌వేగా మార్చాలని నిర్ణయించారు. ఏప్రిల్ నుంచి ఈ పనులు కొనసాగుతున్నాయి. భూగర్భంలో ఆర్‌సీసీ బాక్సులు పరచి విద్యుత్, టెలిఫోన్ వైర్లను అండర్‌గ్రౌండ్‌లో వేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందుకోసం చాందినీచౌక్ మెయిన్‌రోడ్‌పై నార్తన్ క్యారేజ్‌వే ను కొంతమేర ట్రాఫిక్ కోసం మూసివేశారు. దాంతో చాందినీచౌక్, ఫతేపురి మసీదు మధ్య రెండు వైపులా సింగిల్ క్యారేజ్ వేపైనే వాహనాల రాకపోకలు జరుగుతన్నాయి. దాంతో సదరన్ సైడ్‌పై ట్రాపిక్ సమస్యలు అధికమయ్యాయి. ఇటువైపునే వాహనాలను కూడా పార్క్ చేయడం వల్ల రోజు భారీ ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోంది. దీన్ని అధిగమించేందుకు మొత్తం చాందినీచౌక్ మెయిన రోడ్ ను సోమవారం నుంచి వన్‌వేగా మార్చాలని నిర్ణయించారు.
వన్‌వేగా చాందినీచౌక్ మెయిన్ రోడ్
Published Sat, Nov 8 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM
Advertisement
Advertisement