![Woman and Man Misbehaved With Traffic Police - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/17/women.jpg.webp?itok=q3kz_SvK)
సాక్షి, న్యూఢిల్లీ: తాగిన మైకంలో ఉన్న ఓ మహిళ, ఓ వ్యక్తి నడిరోడ్డు మీద వీరంగం వేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తుండటంతో స్కూటీ మీద వెళుతున్న వారిని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రెచ్చిపోయారు. తమ స్కూటీని ఆపిన ట్రాఫిక్ పోలీసులపై చిందులు తొక్కారు. స్కూటీ మీద వెనుక కూర్చున్న మహిళ.. తమను వెళ్లనివ్వాలని గట్టిగా కేకలు వేస్తూ.. ట్రాఫిక్ పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించారు. స్కూటీ తాళం చెవిని తీసుకున్న ట్రాఫిక్ పోలీసును కొట్టి.. అతని నుంచి తాళం చెవిని లాక్కున్నారు.
ఢిల్లీలోని మాయాపురిలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో స్కూటీ మీద ఉన్న ఇద్దరూ తప్పతాగి ఉన్నారని, ట్రాఫిక్ పోలీసులతో అసభ్యంగా దురుసుగా ప్రవర్తించినందుకు వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో స్కూటీని నడుపుతున్న వ్యక్తిని అనిల్ పాండే, ఆయన వెనుక కూర్చున్న మహిళను మాధురిగా గుర్తించి.. శనివారం రాత్రి వారిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment