హైదరాబాద్: హైదరాబాద్‌లో దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. ఏకంగా ఆలయ హుండినే కొల్లగొట్టారు. దేవుడి హుండీలనైతే కొల్లగొట్టారు కానీ.. గుడిలోని నిఘానేత్రం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో హుండీలు చోరీకి గురయ్యాయి. ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు.. హుండీ చోరీ అయినట్టు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.
అంతే రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలో రికార్డయిన రీల్‌ను రివర్స్ చేశారు. ఉదయం ఆలయ ఆవరణను శుభ్రంచేసేందుకు వచ్చిన వ్యక్తితో పాటు మరో వ్యక్తి చోరీకి పాల్పడినట్టు తేలింది. వీరిద్దరు కలసి ఆలయంలో వేసిన ప్రతిఅడుగు రికార్డయింది. అయితే దొంగలు తమబండారం బయటపడకుండా ఉండేందుకు సీసీ కెమెరా వైర్లను కట్ చేశారు. మానిటర్‌ను ఎత్తుకెళ్లారు. ఇదొక్కటే కాదు.. ఇటీవల దొంగలు వరుసగా ఆలయాలనే టార్గెట్ చేస్తున్నారు.
ఏకంగా దేవుడి హుండీనే కొల్లగొట్టారు
Published Wed, Feb 11 2015 1:37 PM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM
Advertisement
Advertisement