ఫ్రాన్స్: ప్యారిస్ రెస్టారెంట్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది బ్రహీం అబ్దేస్లామ్ (31) ఆత్మాహుతి దాడి ఘటన లైవ్ సీసీటీవీ ఫుటేజీని తొలిసారి ఫ్రాన్స్ విడుదల చేసింది. ఈ వీడియోలో అబ్దెస్లామ్ శరీరం రెండు ముక్కలు కావడం కనిపించింది. గత ఏడాది నవంబర్ 13న కాంప్టాయిర్ వోల్టేయిర్ బ్రస్సేరిలో అబ్దెస్లామ్ ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాదాపు 130 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వీడియోలో చూపిన ప్రకారం తొలుత బ్రహీం ఓ కారులో దిగాడు.
అనంతరం రెస్టారెంటులోపలికి అడుగుపెట్టి ఓ ఖాళీ టేబుల్ వద్దకు వచ్చాడు. మరోసారి టేబుల్ నుంచి లేచి డోర్ వద్దకు వెళ్లి నిల్చున్నాడు. ఏదో ఆలోచించి కొంత కలత చెందుతున్నట్లుగా కలత చెందాడు. ఆ తర్వాత తిరిగి అదే టేబుల్ వద్దకు వచ్చికి తన ఎడమ చేత్తో ముఖాన్ని కవర్ చేస్తూ.. కిందికి చూశాడు. అనంతరం స్యూసైడ్ బెల్ట్ బటన్ నొక్కాడు. క్షణాల్లో భారీ శబ్ధం రావడంతోపాటు రెస్టారెంటుమొత్తం పొగలు కమ్మింది. అతడి దేహం రెండు ముక్కలుగా చీలిపోయింది.
క్షణాల్లో దేహం రెండుగా చీలిపోయింది..!
Published Tue, Apr 26 2016 12:02 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement