డబ్బు రాలేదని ఏటీఎంను ఏం చేశాడంటే.. | ATM fails to produce cash, man damages machine | Sakshi
Sakshi News home page

డబ్బు రాలేదని ఏటీఎంను ఏం చేశాడంటే..

Published Mon, Jul 4 2016 10:19 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

డబ్బు రాలేదని ఏటీఎంను ఏం చేశాడంటే..

డబ్బు రాలేదని ఏటీఎంను ఏం చేశాడంటే..

చెన్నై: ఏటీఎంలో డబ్బులు రావడంలేదనే కోపంతో ఓ వ్యక్తి దాన్ని పగలగొట్టడమే కాకుండా.. సీసీటీవీ కెమెరా ధ్వంసం చేశాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కుడలోర్ అనే గ్రామంలోని అమన్ కోయిల్ స్ట్రీట్ కు చెందిన వీరన్(30) అనే వ్యక్తి తన సోదరిని చూసేందుకు పెరుంగుడి వచ్చాడు.

రాత్రి వాడపలానీలో సినిమా చూసిన తర్వాత తిరిగొస్తూ తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో డబ్బు తీసుకునేందుకు ఒక ఏటీఎం వద్దకు వెళ్లాడు. డబ్బు తీసేందుకు చాలా సేపు ప్రయత్నించినా అది మొరాయించింది. దీంతో ఇక కోపంతో ఆ ఏటీఎంపై ఆగ్రహం చూపించడం మొదలుపెట్టాడు. సీసీటీవీ, ఏటీఎం పగలగొట్టడమే కాకుండా అక్కడ ఉన్న అద్దాలను కూడా ధ్వంసం చేశాడు. అదే సమయంలో పెట్రోలింగ్ కు వచ్చిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించినా పారపోయాడు. చివరికి అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement