'ఆ రోజు బస్సును అడ్డగోలుగా నడిపారు' | Caught on Camera: Bus, Minutes Before Punjab Teen's Death, Brazenly Violated Rules | Sakshi
Sakshi News home page

'ఆ రోజు బస్సును అడ్డగోలుగా నడిపారు'

Published Sun, May 3 2015 12:56 PM | Last Updated on Mon, Mar 25 2019 3:06 PM

'ఆ రోజు బస్సును అడ్డగోలుగా నడిపారు' - Sakshi

'ఆ రోజు బస్సును అడ్డగోలుగా నడిపారు'

చండీగఢ్: పంజాబ్లో బస్సులోంచి తోయడంవల్ల పద్నాలుగేళ్ల బాలిక ప్రాణాలు పోయిన ఘటన గురించి పోలీసులు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. బస్సు ప్రయాణించిన రూట్లోని సీసీటీవీ కెమెరాల వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో ప్రకారం ఆరోజు బస్సును వారు అడ్డగోలిగా ఇష్టం వచ్చినట్లు నడిపినట్లు తెలిసింది. పూర్తిగా నియమనిబంధనలు భేఖాతరు చేసినట్లు కూడా స్పష్టమైంది. నాలుగు లేన్ల రోడ్డులో వాహనాలకు ఎదురుగా నడపడంతోపాటు రెప్పపాటులో ట్రాక్టర్ను ఢీకొట్టే ప్రమాదం తప్పించుకున్నారని వీడియో ద్వారా తెలిసింది.

నాలుగు రోజుల కిందట పంజాబ్లోని మోగా జిల్లాలో బస్సు ఎక్కిన తల్లి కూతుర్లపై లైంగిక వేధింపులకు పాల్పడి వారు అడ్డుకోవడంతో బస్సు వేగంగా కదులుతుండగానే వారిని కిందికి తోసేసిన విషయం తెలిసిందే. ఆ చర్యతో కూతురు చనిపోగా.. తల్లికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై ఒక్కసారిగా తీవ్ర నిరసన రావడంతో పోలీసులు కేసు దర్యాప్తును వేగం చేశారు. ఈ నేపథ్యంలోనే సీసీటీవీ ఫుటేజీ సేకరించి పరిశీలించగా ఈ తాజా వాస్తవాలు బయటపడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement