bus driving
-
ఎస్సీ మహిళలకు బస్ డ్రైవింగ్‌లో శిక్షణ
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ద్వారా ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. ఎస్సీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలపై వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శిక్షణ అనంతరం వారికి ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో డ్రైవర్లుగా అవకాశం కల్పిస్తామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల సౌజన్యంతో నర్సింగ్ కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తామని చెప్పారు. భారీ వాహనాల కొనుగోలు కోసం ఇచ్చే రుణ మొత్తాన్ని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకం కింద విదేశాల్లో పీజీ చేసేవారికి రూ.20 లక్షలు, స్వదేశంలో పీజీ చేసే వారికి రూ.15 లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, డైరెక్టర్ కె.హర్షవర్ధన్, గురుకులాల కార్యదర్శి పావనమూర్తి, లిడ్‌క్యాప్ సీఎండీ డోలా శంకర్, ఎస్సీ కార్పొరేషన్ జీఎం కరుణకుమారి పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై అవగాహన అంతకుముందు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై మంత్రి మేరుగ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దళితులు, గిరిజనులను వేధించకూడదని అగ్రవర్ణాల వారికి, తప్పుడు కేసులు పెట్టకూడదని ఎస్సీ, ఎస్టీలకు అవగాహన కల్పించాలన్నారు. తహశీల్దార్లు, ఎస్సైలు వారానికి ఓసారి గ్రామాల్లోకి వెళ్లి ప్రజల్ని చైతన్య పరచాలన్నారు. ఈ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో అతి తక్కువ శాతం నిందితులకు మాత్రమే శిక్షలు పడుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలు ఏర్పడినందున అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కేసులను విచారించే డీఎస్పీలను నియమించాలన్నారు. ఈ సమావేశంలో సీఐడీ పీసీఆర్ ఎస్పీ రత్న, జేడీ ప్రాసిక్యూషన్ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు
రాయదుర్గం: డ్రైవింగ్ చేస్తుండగా ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు. ఆ సమయంలోనూ ప్రయాణికుల క్షేమం గురించి ఆలోచించాడు. ఓ వైపున నొప్పి గుండెను మెలిపెడుతున్నప్పటికీ పంటి బిగువన బాధను భరిస్తూనే బస్సును నియంత్రించాడు. 40 మంది ప్రయాణికులను కాపాడి.. తాను మాత్రం కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. కండక్టర్ హరినాథ్ తెలిపిన వివరాల మేరకు.. రాయదుర్గం పట్టణానికి చెందిన ఇస్మాయిల్ (56) స్థానిక ఆర్టీసీ డిపోలో ఔట్ సోర్సింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఏపీ 02 జెడ్ 4341 నంబరు గల బస్సును తీసుకుని రాయదుర్గం నుంచి బళ్లారికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యంలోని డి.హీరేహాళ్ మండలం సోమలాపురం వద్దకు రాగానే ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి మొదలైంది. నీళ్లు తాగి సముదాయించుకుని బస్సును అలాగే ముందుకు నడిపాడు. కొంత సేపటికే నొప్పి మరింత తీవ్రమైంది. వేగంగా వెళుతున్న బస్సును నియంత్రించి రోడ్డు ప్రక్కగా నిలిపాడు. ప్రయాణికులు పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే డ్రైవర్ ఇస్మాయిల్‌ను సమీపంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మాత్ర మింగిన కొద్దిసేపటికే ఇస్మాయిల్ మృతి చెందాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి దేవుడిలా తమ ప్రాణాలు కాపాడాడని ప్రయాణికులు పేర్కొన్నారు. -
అలిపిరి నుంచి తిరుమల కు బస్ డ్రైవింగ్ గేమ్
-
మని‘షి’ తలచుకుంటే కానిది ఏదీ లేదు..
హెవీ వెహికిల్ డ్రైవింగ్ నేర్పిస్తామని ఆర్టీసీ వారు ప్రకటన ఇవ్వడమే ఆలస్యం.. రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువలా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. ఆనక చూస్తే అందులో ఒకే ఒక్కదానిపై యువతి సంతకం ఉంది. నిజమేనా.. అని అధికారులు ఆశ్చర్యపడేలోపే ఆ యువతి చక్కగా శిక్షణ కూడా పూర్తి చేసుకుంది. మని‘షి’ తలచుకుంటే కానిది ఏదీ లేదని నిరూపించింది. తండ్రిలోని సైనికుడి తెగువకు తన తెలివిని జత చేసిన ఈ యువ ఇంజినీర్ ఇప్పుడు సిక్కోలు యువతులకు ఆదర్శంగా నిలిచింది. హెవీ వెహికిల్ డ్రైవింగ్ నేర్చుకున్న అతికొద్ది మహిళల్లో తన పేరునూ జత చేసుకుంది. సిక్కోలుకు చెందిన చల్లా ఆశ.. ఇలా తన ఆశను నెరవేర్చుకున్నారు. సాక్షి, శ్రీకాకుళం: డ్రైవింగ్ అంటే ఆడవారు ఆమడ దూరంలో ఉండాలనే ఛాందసం ఇంకా సమాజంలో ఉంది. దాన్ని ఛేదించుకుంటూ ఇ ప్పటికే చాలా మంది బైకులు, ఆటోలు, కార్లను రయ్‌మంటూ పోనిస్తున్నారు. కానీ హెవీ వెహికిల్ డ్రైవింగ్ మాత్రం మగాళ్ల సామ్రాజ్యం లాగానే మిగిలిపోయింది. కానీ ఇప్పుడో సిక్కోలు మహిళ ఆ సామ్రాజ్యంలోకి ప్రవేశించింది. తానూ సారథినేనంటూ విజయవంతంగా హెవీ వెహికిల్ శిక్షణ పూర్తి చేసింది.ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ ఇటీవల హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణ పొందేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు మగవారితోపాటు ఒక మహిళ కూడా దరఖాస్తు చేసుకుంది. ఆ యు వతి సిక్కోలుకు చెందిన వారు కావడం అందరికీ గర్వ కారణం. (పెళ్లి కోసం దాచిన 9 లక్షలు బూడిద) ఆమె పేరు చల్లా ఆశ. విద్యాభ్యాసం బీటెక్ (ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్). తండ్రి చల్లా వెంకటరావు ఆర్మీలో హానరీ సుబే దార్ మేజర్(రిటైర్డ్). తల్లి చల్లా దమయంతి. గృహిణి. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో తప్ప మరే జిల్లాలో కూడా హెవీ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకునేందుకు మహిళలు ముందుకు రాలేదు. దీంతో ఆ మహిళకు శిక్షణ ఇచ్చిన వారు ఎంతో సంతోషించారు, ప్రోత్సహించారు. హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో 40 రోజుల శిక్షణను విజయవంతంగా ముగించుకుని హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో సర్టిఫికెట్ పొందిన మొట్టమొదటి మహిళగా ఆమె నిలిచారు. ఆశ 8వ తరగతి చదివేటప్పటి నుంచే మైదానంలో ద్విచక్రవాహనం డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణ పొంది ఎంతో మంది యువతకు మార్గదర్శకంగా నిలిచారు. ఆమె మాటల్లో.. ‘డ్రైవింగ్‌లో నాకు స్ఫూర్తి నాన్నే. ఫస్ట్ క్లాస్‌లో ఉన్నపుడు సైకిల్ కొనిచ్చారు. తర్వాత నాన్న టీవీఎస్ మోపెడ్ కొన్నారు. ఆ సమయంలో కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ డ్రైవింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాను. 8వ తరగతి చదివే సమయంలో మామయ్య వద్ద పల్సర్ బైక్ ఉండేది. మామయ్యను ఒప్పంచి దానిపై డ్రైవింగ్ నేర్చుకున్నాను. 2012లో ఇంటర్మీడియెట్‌లో నాన్న ఆశించిన మార్కులు కంటే ఎక్కువ మార్కులు (900 అనుకుంటే 952 మార్కులు) సాధించడంతో నాన్నే స్వయంగా పల్సర్ బైక్ కొనిచ్చారు. 2016లో బీటెక్ ఫైనలియర్ చదివేటప్పుడు కార్ కొనడంతో కారుడ్రైవింగ్ నేర్చుకున్నాను. ఈ ఏడాది జూలై లో నే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా తీసుకున్నాను. హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ సమయంలో ఎంతో నేర్చుకున్నాను. (ఒక్కడు.. గ్రామాన్ని మార్చాడు!) హెవీ వెహికల్ డ్రైవింగ్ చాలా క్లిష్టమైనది. ఓర్పు, నేర్పుతో కూడుకున్నది. ట్రాఫిక్‌లో ఏవిధంగా డ్రైవింగ్ చేయాలి, ట్రాఫిక్ రూల్స్, టెక్నికల్ పాయింట్లు, బ్రేక్ డౌన్ సమయంలో మెకానికల్‌గా ఏ విధంగా చేయాలి, లైసెన్స్ ఏవిధంగా పొందాలి తదితర విషయాలను క్షుణ్ణంగా నేర్చుకున్నాను. ఈ 40 రోజుల శిక్షణ నాకు ఎంతగానో ఉపయోగపడింది. ఈ క్రెడిట్ మొత్తం నాన్నకే దక్కుతుంది. డ్రైవింగ్ నేర్చుకుంటానంటే నాన్న నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పొందేందుకు చేరిన సమయంలో నన్ను ఎంతోమంది కలిశారు. ఈ డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల కలిగే ఫలితాలను వారికి వివరించాను. వారిలో కూడా డ్రైవింగ్‌పై ఆసక్తి కలిగేలా చేశాను. హెవీ వెహికల్ డ్రైవింగ్ సమయంలో శిక్షకుడు వర్మ నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. పూర్తిస్థాయిలో మెలకువలు నేర్పించారు.’ అంటూ సారథిగా తన అనుభవాన్ని వివరించారామె. -
ఈ ‘నన్’.. బస్సు నడుపున్
కొచ్చి: నన్‌లు సైతం ఏ పనైనా చేయగలరని నిరూపిస్తున్నారు కేరళకు చెందిన సిస్టర్ ఫించిత(53). ఇరవయ్యేళ్ల క్రితమే (2000లో) ఫించిత భారీ వాహనాలు నడిపే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ (హెచ్‌డిఎల్) పొందారు. ఫ్రాన్సిసన్ క్లారిస్టు క్రైస్తవ సమాజంలో ఆ ఘనత సాధించిన మొట్టమొదటి నన్‌గా నిలిచారు. కలాడీ పట్టణం, మణికమంగళంలోని సెయింట్ క్లేర్ ఓరల్ స్కూల్ అనే బధిరుల (వినికిడి లోపమున్నవారి) పాఠశాలలో 1994 నుంచి ప్రధానోపాధ్యాయురాలిగా కొనసాగుతున్నారు. స్కూల్‌బస్ డ్రైవర్ డుమ్మా కొట్టినప్పుడల్లా తానే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటానని ఆవిడ ఉత్సాహంగా తెలిపారు. విద్యార్థుల్ని విహారయాత్రలకు తీసుకువెళ్లినప్పుడు డ్రైవర్, తానూ షిఫ్టులు వేసుకుని బస్సుని నడిపేవారమని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల స్కూలు మూసి ఉన్నా బస్సును కండిషన్లో ఉంచేందుకు స్కూల్ గ్రౌండులో రోజూ కాసేపు నడుపుతున్నారు. 1999లో ఒకసారి పిల్లల్ని విహారయాత్రకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో బస్సుని నడుపుతావా అని తనని మదర్ సుపీరియర్ అడిగారన్నారు. అందుకు తాను ప్రయత్నించి చూస్తాను, కానీ హెచ్‌డిఎల్ లేదని చెప్పగా దానికోసం ప్రయత్నించమని ఆవిడ సూంచించారన్నారు. ఏడాదికల్లా అన్ని టెస్టులు పాసై మొదటి ప్రయత్నంలోనే లైసెన్సు సాధించానని గుర్తు చేసుకున్నారు. అప్పటినుంచి డ్రైవింగ్ తన జీవితంలో భాగమైందన్నారు. హెచ్‌డీఎల్ రాకముందు కారుతో చిన్న ఆక్సిడెంట్ చేశానని తెలిపిన ఫించిత అదృష్టవశాత్తూ ఎవరికీ ఏ హాని కలగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాని, తాను చేసిన చివరి ఆక్సిడెంట్ అదేనని వివరించారు. ఇటీవల తన లైసెన్సు గడువు తీరిపోయందన్నారు. దాన్ని పునరుద్ధరించుకోవడానికి మళ్లీ కొన్ని పరీక్షలు పాసవాలని, అందుకే ప్రాక్టీసు కోసం స్కూలు పరిసరాల్లో బస్సుతో రోజూ కొంతసేపు చక్కర్లు కొడుతున్నానని పేర్కొన్నారు. చదవండి: రాత్రి చితక్కొట్టి: పొద్దున అల్లుడ్ని చేసుకున్నారు -
'ఆ రోజు బస్సును అడ్డగోలుగా నడిపారు'
చండీగఢ్: పంజాబ్‌లో బస్సులోంచి తోయడంవల్ల పద్నాలుగేళ్ల బాలిక ప్రాణాలు పోయిన ఘటన గురించి పోలీసులు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. బస్సు ప్రయాణించిన రూట్లోని సీసీటీవీ కెమెరాల వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో ప్రకారం ఆరోజు బస్సును వారు అడ్డగోలిగా ఇష్టం వచ్చినట్లు నడిపినట్లు తెలిసింది. పూర్తిగా నియమనిబంధనలు భేఖాతరు చేసినట్లు కూడా స్పష్టమైంది. నాలుగు లేన్ల రోడ్డులో వాహనాలకు ఎదురుగా నడపడంతోపాటు రెప్పపాటులో ట్రాక్టర్‌ను ఢీకొట్టే ప్రమాదం తప్పించుకున్నారని వీడియో ద్వారా తెలిసింది. నాలుగు రోజుల కిందట పంజాబ్‌లోని మోగా జిల్లాలో బస్సు ఎక్కిన తల్లి కూతుర్లపై లైంగిక వేధింపులకు పాల్పడి వారు అడ్డుకోవడంతో బస్సు వేగంగా కదులుతుండగానే వారిని కిందికి తోసేసిన విషయం తెలిసిందే. ఆ చర్యతో కూతురు చనిపోగా.. తల్లికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై ఒక్కసారిగా తీవ్ర నిరసన రావడంతో పోలీసులు కేసు దర్యాప్తును వేగం చేశారు. ఈ నేపథ్యంలోనే సీసీటీవీ ఫుటేజీ సేకరించి పరిశీలించగా ఈ తాజా వాస్తవాలు బయటపడ్డాయి.