ఈ పిల్లాడు అదృష్ట జాతకుడే.. | Caught on camera: Child pulled off rail tracks moments before train pulled in | Sakshi
Sakshi News home page

ఈ పిల్లాడు అదృష్ట జాతకుడే..

Published Tue, Dec 22 2015 12:37 PM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM

ఈ పిల్లాడు అదృష్ట జాతకుడే..

ఈ పిల్లాడు అదృష్ట జాతకుడే..

ముంబయి: అదృష్టమనేది ఉందా అనే అనుమానంలోకి జారుకోగానే.. నిజంగానే అది ఉందనిపించేలాగా కొన్ని సంఘటన ఆవిష్కృతమవుతుంటాయి. దీంతో తిరిగి మనిషి అనుమానం నుంచి నమ్మకంలోకి మారిపోతుంటాడు. ఈ సంఘటన గురించి తెలిసిన తర్వాత నిజంగా అదృష్టం ఉందని అనుకుంటారేమో. థానేలోని అంబర్ నాథ్ అనే రైల్వే స్టేషన్ జనాలతో కిక్కిరిసి ఉంది. అటునుంచి లోకల్ రైలు వేగంగా దూసుకొస్తుంది. అది గమనించని ఓ పిల్లాడు అవతలి ప్లాట్ ఫాం నుంచి ఇవతలి వైపు దూసుకొచ్చాడు.

సరిగ్గా ప్లాట్ ఫాం కంటే కొద్ది ఎత్తు మాత్రమే ఆ పిల్లాడు ఉన్నాడు. రైలు వేగంగా వస్తోంది. ప్రయాణీకులంతా ఏం జరుగుతుందో అని కంగారు పడిపోతున్నారు. ఇంతలో రైల్వే పోలీసు ఎంతో సాహసంతో ఆ పిల్లాడికి చేయందించాడు. అదే సమయంలో మిగితా ప్రయాణీకులు కూడా అతడిని రక్షించేందుకు కానిస్టేబుల్ కు తోడయ్యాడు. సరిగ్గా అతడిని రైలు సమీపించే సమయానికి పైకి లాగారు. దీంతో రెప్పపాటులో ఆ పిల్లాడి ప్రాణం ప్రమాదం నుంచి బయటపడింది. రైల్వే కానిస్టేబుల్ సాహసాన్ని అక్కడి ప్రయాణీకులు అభినందించారు. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డయి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement