కువైట్: ఎంతో నమ్మకంగా ఇంట్లో పని చేయాల్సిన ఓ మహిళ చేయకూడని తప్పుచేసి అడ్డంగా దొరికిపోయింది. సీసీ టీవీలో అసలు విషయాన్ని గమనించిన యజమాని షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ వివరాలిలా ఉన్నాయి.. కువైట్ లో ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు హౌస్ మెయిడ్స్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటి యజమాని తనకు జ్యూస్ కావాలని అడిగాడు. ఇంతలో ఓ మహిళ జ్యూస్ తయారు చేసి ఏదో పనిమీద కాస్త పక్కకువెళ్లింది.
అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. మరో మహిళ యజమాని కోసం సిద్ధం చేసిన జ్యూస్ లో తన యూరిన్ ను పోసింది. ఈ దృశ్యాలు వంటింట్లో ఏర్పాటుచేసిన సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ వీడియోను గమనిస్తే ఆ మహిళ ఆ పనికి ముందే సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అయితే ఆ పుటేజ్ ఎలాగో బయటకు లీక్ అయింది. ఈ విషయం ఆనోటా ఈనోటా మీడియాకు చేరింది.
మీడియా ఆ కుటుంబాన్ని సంప్రదించగా, కెమెరాలో ఆ దృశ్యాన్ని చూసి షాక్ తిన్నానని యజమాని చెప్పాడు. కానీ, ఆ ఘాతుకానికి పాల్పడ్డ పనిమనిషి పేరు, వివరాలు వెల్లడించేందుకు ఇంటి యజమాని నిరాకరించాడు. అయితే చుట్టుపక్కల ఇళ్లవారిని మాత్రం పనివారి చేష్టలపై కన్నేసి నిఘా పెట్టాలని సూచన చేయటం విశేషం.