
‘ర్యాగింగ్‌పై చర్యలు తీసుకోండి’
సాక్షి, హైదరాబాద్: ర్యాగింగ్‌ను అరికట్టేందుకు యూనివర్సిటీలు, కళాశాలల యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ఆదేశించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు ప్రతి విద్యా సంస్థలో ర్యాగింగ్ నిరోధక కేంద్రాలు తెరవాలని శనివారం పేర్కొన్నారు. ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి, తనిఖీ బృందాలన ు ఏర్పాటు చేయాలని సూచించారు.
కమిటీలు క్రమం తప్పకుండా సమావేశమై పరిస్థితిని సమీక్షించాలని చెప్పారు. సహాయ కేంద్రాలు, అత్యవసర సర్వీసులు ఏర్పాటు చేయాలని, క్యాంపస్‌లోని ముఖ్య ప్రాంతాల్లో సీసీటీవీలు అమర్చి, అలారం బెల్స్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్‌పై తీసుకుంటున్న చర్యలకు సంబంధించి కార్యాచరణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని వైస్ చాన్స్‌లర్లను ఆదేశించారు.