సిద్ధార్థ్‌-అదితీల 'బొమ్మరిల్లు' | Siddharth And Aditi Rao Hydari Wedding Pics Goes Viral | Sakshi
Sakshi News home page

Siddharth-Aditi Rao Hydari: ఒక్కటైన సిద్ధార్థ్-అదితీ.. ఫొటోలు వైరల్

Sep 16 2024 12:15 PM | Updated on Sep 16 2024 1:06 PM

Siddharth And Aditi Rao Hydari Wedding Pics Goes Viral

హీరో సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నాడు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న హీరోయిన్ అదితీ రావు హైదరీతో ఏడడుగులు వేశాడు. వనపర్తి జిల్లాలోని దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో వివాహం జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని అదితీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పట్టు వస్త్రాల్లో కొత్త జంట చూడముచ్చటగా ఎంత చక్కగా ఉన్నారో?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్‍.. ఆ మూడు కాస్త స్పెషల్)

ఈ ఏడాది మార్చిలో వనపర్తి జిల్లాలోని రంగనాథ స్వామి ఆలయంలో నిశ్చితార్థం జరిగింది. హీరోయిన్ అదితీ రావు హైదరీ పూర్వీకులది వనపర్తి. అందుకే ఈ గుడిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పెళ్లి కూడా ఇక్కడే చేసుకున్నారు. అయితే ఈ శుభకార్యం ఆదివారం జరిగిందా? సోమవారం ఉదయం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. 

'మహాసముద్రం' సినిమా షూటింగ్‌ టైంలో సిద్దార్థ్-అదితీకి పరిచయం ఏర్పడింది. అలా కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. తెలుగులో 'బాయ్స్', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' లాంటి సినిమాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. అదితీ కూడా 'సమ్మోహనం' లాంటి సినిమాతో ఆకట్టుకుంది.

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

(ఇదీ చదవండి: తమన్‌కి ఏడాదికో ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్న అనుష్క)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement