తమన్‌కి ఏడాదికో ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్న అనుష్క | SS Thaman Comments On Anushka Shetty Gifting Iphones | Sakshi
Sakshi News home page

Thaman-Anushka: అనుష్క-తమన్ మధ్య ఇంత బాండింగ్ ఉందా?

Published Mon, Sep 16 2024 9:58 AM | Last Updated on Mon, Sep 16 2024 10:47 AM

SS Thaman Comments On Anushka Shetty Gifting Iphones

సినిమా హిట్ అయితే డైరెక్టర్, హీరోకి నిర్మాత కారు లేదా విలువైన వస్తువులు గిఫ్ట్ ఇవ్వడం కామన్. కానీ ఓ హీరోయిన్ ప్రతి ఏడాది మ్యూజిక్ డైరెక్టర్‌కి బహుమతి ఇవ్వడం అంటే స్పెషలే కదా! స్వీటీ అనుష్క శెట్టి ఇలానే ప్రతి ఏటా మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి గిఫ్ట్ ఇస్తోంది. తాజాగా ఈ విషయాన్ని తమన్ బయటపెట్టాడు.

'రాజా సాబ్', 'గేమ్ ఛేంజర్' లాంటి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండే తమన్.. 'తెలుగు ఇండియన్ ఐడల్' పాటల పోటీకి జడ్జిగానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో మాట్లాడుతూ అనుష్కని తెగ పొగిడేశాడు. తనకు 'భాగమతి' షూటింగ్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ ప్రతి ఏడాది ఓ ఐఫోన్ బహుమతిగా ఇస్తుందని చెప్పాడు.

(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు)

'అనుష్క హీరోయిన్ అని కాదు గానీ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆమె మనసు బంగారం, అందం గురించి పక్కనబెడితే ఎంతో మంచి వ్యక్తి. ఇన్‌సైడ్ బ్యూటిఫుల్. నాకు ఇచ్చిన మాట ప్రకారం అనుష్క నుంచి ప్రతి సెప్టెంబరులో నాకు ఓ ఐఫోన్ గిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు వాడుతున్న ఫోన్ కూడా అదే. 'భాగమతి' షూటింగ్ టైంలో నాకు ఐఫోన్ అంటే ఇష్టమని అనుష్కతో చెప్పాను. మూవీ హిట్ అయితే ఇవ్వాలని అన్నాను. అలా ఐఫోన్ నాకు గిఫ్ట్‌గా వస్తుంటుంది. యూవీ ఆఫీస్ నుంచి అనుష్క ద్వారా నా దగ్గరకు ఐఫోన్ వస్తుంది. అలానే  అనుష్క అంటే నాకు ఇష్టం. తనే నా జీవితం. నేను ఇంతవరకు చూసిన బెస్ట్ హ్యుమన్ అనుష్క' అని తమన్ చెప్పుకొచ్చాడు.

చివరగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాలో కనిపించిన అనుష్క.. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. మరోవైపు తమన్ చెప్పినట్లు 'భాగమతి 2' కోసం రెడీ అవుతోంది. ఇందుకోసం ఫిట్‌గా మారే పనిలో ఉంది. అందుకే బయట కనిపించట్లేదు. సరే ఇవన్నీ పక్కనబెడితే అప్పుడెప్పుడో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఏడాది ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వడం విశేషమనే చెప్పాలి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్‍.. ఆ మూడు కాస్త స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement