ఓ ఇంటి ముందు మంట వేసిన ఆందోళనకారులు
మోర్తాడ్ (బాల్కొండ): తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన కమ్మర్‌పల్లి మండలం హాసకొత్తూర్‌కు చెందిన యువకుడు సిద్దార్థది పరువు హత్యగా పోలీసులు భావిస్తు న్నారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా అనుమా నిస్తున్న టీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కనక రాజేష్ సంబంధికులతో సిద్ధార్థ ప్రేమ వ్యవహారం నడిపించడమే హత్యకు దారితీసి ఉండవచ్చని అంటున్నారు.
కొన్ని రోజుల నుంచి యువతితో వాట్సప్ చాటింగ్, ఫోన్‌లో మాట్లాడటం జీర్ణించుకోలేకనే సిద్ధార్థపై దాడి చేసి ఉంటారని వెల్లడవుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు సిద్దార్థను తీసుకువెళ్లి తీవ్రంగా చితకబాదారని అనుమానిస్తున్నారు. సిద్ధార్థపై ఎక్కువ మంది దాడి చేయడం, తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా వైద్యం కోసం ప్రధాన నిందితుడే ఆర్మూర్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. సిద్ధార్థను రాజేష్ గతంలోనే హెచ్చరించడాన్ని బట్టి పరువు హత్యగానే వెల్లడవుతోంది.
పోలీసుల తీరుతోనే..
సిద్ధార్థ హత్య కేసులో పోలీసులు నిందితులకు కల్పించిన రాచమర్యాదల తీరుతోనే హాసకొత్తూర్‌లో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గురువారం మృతుని కుటుంబ సభ్యు లు, గ్రామస్తుల ఆందోళనతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసు స్టేషన్లో నిందితులు భోజనాలు చేస్తున్న ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇది చూసిన గ్రామస్తులు నిందితులకు పోలీసులు రాచమర్యాదలు కల్పిస్తున్నారని ఆరోపిస్తూ ఆగ్రహంతో ఆందోళనకు పూనుకున్నారు. పోలీసుల వాహనం అద్దాలు పగుల గొట్టారు. మోహరించిన పోలీసు బలగాలను, అధికారులను గ్రామం బయటకు పంపించేశారు. నిందితుడు కనక రాజేశ్ ఇంటిపై దాడి చేసి ఇంట్లోని సామగ్రి ధ్వంసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment