mortad mandal
-
Siddartha Murder: ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం
సాక్షి, కమ్మర్పల్లి: మండలంలోని హాసాకొత్తూర్‌లో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారమే హత్యకు దారి తీసిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్య ఘటనలో ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్మూర్ ఏసీపీ రఘు తెలిపిన ప్రకారం.. మాలవత్ సిద్దార్థ(17), కనక రాజేష్ బంధువైన యువతి మధ్య ఐదారు నెలలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. క్రమంగా సోషల్ మీడియాలో చాటింగ్ వరకు వెళ్లింది. ఈ విషయం రాజేష్‌కు తెలియడంతో తన స్నేహితులు దోన్పాల్ పృథ్వీరాజ్, జుంబరాత్ అన్వేష్‌తో కలిసి సిద్దార్థను బెదిరించాడు. సిద్దార్థ, అతని సోదరుడు కృష్ణలను హెచ్చరించాడు. హెచ్చరికలను ఖాతరు చేయకపోవడంతో ఎలాగైన కొట్టి భయభ్రాంతులకు గురి చేయాలని రాజేష్ భావించాడు. ఈ క్రమంలో బుధవారం నందిపేట్‌కు చెందిన సల్మాన్, రాకేష్‌ను హాసాకొత్తూర్‌కు రప్పించి సిద్దార్థపై దాడికి యత్నించారు. కానీ వీలు కాలేదు. అదే రోజు రాత్రి సిద్దార్థకు క్లోజ్ ఫ్రెండ్ అయిన అదే గ్రామానికి చెందిన షేరాల బాలాగౌడ్‌ను కలిసి సిద్దార్థకు ఫోన్ చేసి పిలిపించాడు. సిద్దార్థ రాగానే ద్విచక్ర వాహనాలపై మెట్ల చిట్టాపూర్ రోడ్డులోని బర్రెల మంద వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కర్రలతో విపరీతంగా కొట్టారు. ఒంటిపై గాయాలు కాగా, ద్విచక్ర వాహనంపై గ్రామానికి తీసుకువచ్చి బాలాగౌడ్‌తో బట్టలు తెప్పించి సిద్దార్థకు వేశారు. బాలాగౌడ్ ఇంటి వద్దే పడుకోబెట్టారు. అర్ధరాత్రి దాటాక సిద్దార్థ పరిస్థితి విషమించడంతో ఊపిరి ఆడలేదు. దీంతో బాలాగౌడ్ రాజేష్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. రాజేష్ బాలాగౌడ్‌తో కలిసి సిద్దార్థను తన కారులో మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తెల్లవారుజామున ఉప సర్పంచ్ రాజేశ్వర్‌కు ఫోన్ చేసి సిద్దార్థ కోవిడ్‌తో మరణించాడని చెప్పి అంత్యక్రియలకు ఏర్పాటు చేయాలని కోరాడు. గ్రామానికి చెందిన పీఎంపీ వైద్యుడు మథీన్‌తో కరోనా మృతిగానే రాజేశ్వర్‌కు చెప్పించాడు. కుటుంబీకులకు కూడా కరోనా మృతిగానే సమాచారం అందించాడు. అంబులెన్స్‌కు కూడా కరోనా మృతిగానే చెప్పి మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి చేర్చాడు. కరోనాతో మృతి చెందాడని చెప్పగా సిద్దార్థ కుటుంబ సభ్యులు అనుమానించి ఆర్మూర్‌లో మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో ఆరా తీశారు. కొట్టిన దెబ్బలతోనే మృతి చెందినట్లు విషయం బయట పడింది. ఈ కేసులో రాజేష్‌తో పాటు, పృథ్వీరాజ్, అన్వేష్, బాలాగౌడ్, మథీన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సల్మాన్, రాకేష్ పరారీలో ఉన్నారని ఏసీపీ తెలిపారు. చదవండి: వాట్సప్ చాటింగ్, ఫోన్ కాల్స్.. సిద్ధార్థది పరువు హత్య? -
వాట్సప్ చాటింగ్, ఫోన్ కాల్స్.. సిద్ధార్థది పరువు హత్య?
మోర్తాడ్ (బాల్కొండ): తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన కమ్మర్పల్లి మండలం హాసకొత్తూర్‌కు చెందిన యువకుడు సిద్దార్థది పరువు హత్యగా పోలీసులు భావిస్తు న్నారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా అనుమా నిస్తున్న టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కనక రాజేష్ సంబంధికులతో సిద్ధార్థ ప్రేమ వ్యవహారం నడిపించడమే హత్యకు దారితీసి ఉండవచ్చని అంటున్నారు. కొన్ని రోజుల నుంచి యువతితో వాట్సప్ చాటింగ్, ఫోన్లో మాట్లాడటం జీర్ణించుకోలేకనే సిద్ధార్థపై దాడి చేసి ఉంటారని వెల్లడవుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు సిద్దార్థను తీసుకువెళ్లి తీవ్రంగా చితకబాదారని అనుమానిస్తున్నారు. సిద్ధార్థపై ఎక్కువ మంది దాడి చేయడం, తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా వైద్యం కోసం ప్రధాన నిందితుడే ఆర్మూర్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. సిద్ధార్థను రాజేష్ గతంలోనే హెచ్చరించడాన్ని బట్టి పరువు హత్యగానే వెల్లడవుతోంది. పోలీసుల తీరుతోనే.. సిద్ధార్థ హత్య కేసులో పోలీసులు నిందితులకు కల్పించిన రాచమర్యాదల తీరుతోనే హాసకొత్తూర్‌లో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గురువారం మృతుని కుటుంబ సభ్యు లు, గ్రామస్తుల ఆందోళనతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసు స్టేషన్లో నిందితులు భోజనాలు చేస్తున్న ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇది చూసిన గ్రామస్తులు నిందితులకు పోలీసులు రాచమర్యాదలు కల్పిస్తున్నారని ఆరోపిస్తూ ఆగ్రహంతో ఆందోళనకు పూనుకున్నారు. పోలీసుల వాహనం అద్దాలు పగుల గొట్టారు. మోహరించిన పోలీసు బలగాలను, అధికారులను గ్రామం బయటకు పంపించేశారు. నిందితుడు కనక రాజేశ్ ఇంటిపై దాడి చేసి ఇంట్లోని సామగ్రి ధ్వంసం చేశారు. చదవండి: మృతదేహం మాయం: టీఆర్ఎస్ నాయకుడి ఇంటి ముట్టడి -
డీసీఎంను ఢీకొని పల్టీలు కొట్టిన కారు
మోర్తాడ్: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఇండికా-డీసీఎంలను స్విఫ్ట్ కారు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రెండు వాహనాలను ఢీకొట్టిన తర్వాత స్విఫ్ట్ కారు పల్టీలు కొడుతూ పక్కకు పడిపోయింది. ఈ దుర్ఘటనలో తల్లీకూతురుతో సహా వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.