వరాహా ఫిలిమ్స్ పతాకంపై సంగీత దర్శకుడు వీఆర్.స్వామినాథన్ రాజేష్ నిర్మించిన చిత్రం 'లోకల్ సారక్క'. కొరియోగ్రాఫర్ దినేష్, ఉపాసన హీరో హీరోయిన్‌గా నటించారు. యోగిబాబు, సింగంపులి, ఇమాన్ అన్నాచ్చి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఎస్పీ రాజకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
శనివారం ఉదయం చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం.. స్థానిక సాలి గ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో నటుడు, మాజీ శాసనసభ్యుడు ఎస్వీ శేఖర్, నటుడు, నిర్మాత కె. రాజన్, నటి వనితా విజయకుమార్, సౌదర పాండియన్, విజయ మురళి, సంగీత దర్శకుడు దిన మొదలు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై ఎస్వీ శేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవండి: నా జీవితంలో అది ఎప్పటికీ ప్రత్యేకమే: నిహారిక)
'ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో చిత్రాలు ప్రజలకు హాని కలిగించొద్దు. ఈ చిత్ర టైటిల్ చూస్తే కొంచెం హార్డ్‌గా అనిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో కామెడీతోపాటు మంచి సందేశం ఉంది. దర్శక నిర్మాతలు చిత్ర టైటిల్ కోసం చాలా శ్రమించారు. కళాకారులకు ఆత్మ విశ్వాసం ఉండాలి. ఇటీవల నిర్మాత వైనాట్ శశికాంత్ నా దగ్గరకొచ్చి 'టెస్ట్' మూవీ చేస్తున్నామని అందులో మీరు సిద్ధార్థ్‌కు తండ్రిగా నటించాలని అడిగారు. ఆ తరువాత వచ్చి ప్రధాని మోడీ మద్దతుదారులైన మీతో మోడీని వ్యతిరేకించే సిద్ధార్థ్ నటించని అన్నాడని చెప్పారు.
'దీంతో అందుకు నన్నేం చేయమంటారు అని సదరు దర్శకనిర్మాతని అడిగాను. ఆ తర్వాత ఫోన్‌లో చిత్ర కథ మారిందని, మిమ్మల్ని తీసుకోవడం లేదని నాతో చెప్పారు. వృత్తి వేరు రాజకీయాలు వేరు. ఇది చూస్తుంటే సిద్ధార్థ్ నాతో నటించడానికి భయపడ్డాడు అనిపిస్తుంది. ఈ విషయమై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాను' అని ఎస్వీ శేఖర్ చెప్పారు. కాగా ఈ చిత్రాన్ని కె.వినోద్‌కుమార్ విడుదల చేస్తున్నారు.
(ఇదీ చదవండి: బాహుబలి కట్టప్ప కుటుంబంలో తీవ్ర విషాదం)
Comments
Please login to add a commentAdd a comment