సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా 'మిస్ యూ' వాయిదా పడింది. విడుదల తేదీని ప్రకటించి కూడా ఎలాంటి ప్రకటన లేకుండానే థియేటర్లోకి ఈ చిత్రం రాలేదు. ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అందులో భాగంగా సిద్ధార్థ్ పలు వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 5న పుష్ప విడుదల అవుతున్నప్పటికీ తమ సినిమా నవంబర్ 29న వచ్చి తీరుతుందని ఆయన చెప్పారు. తమకు పోటీ అనే భయం లేదని ఆయన అన్నారు. ఇప్పుడు మిస్ యూ సినిమా విడుదల కాలేదు. అందుకు కారణాలు ఏంటి అంటూ నెటిజన్లు ఎతుకుతున్నారు.
సిద్దార్థ్ మాట్లాడిన మాటలకు చాలామంది మిస్ యూ సినిమా పట్ల ఆసక్తి చూపారు. కానీ, తీరా సినిమా విడుదల సమయానికి థియేటర్‌లో బొమ్మ పడలేదు. నవంబర్ 29న సినిమా విడుదల ఉంటుందని చెప్పిన మేకర్స్ కనీసం వాయిదా పడినట్లు కూడా ప్రకటించలేకపోయారు. ఇంతకూ ఏం జరిగింది అనేది కూడా వారు తెలుపలేదు. పుష్ప సినిమా తమకు అడ్డుకాదు అని చెప్పిన సిద్ధార్థ్ ఇప్పుడు ఎందుకు తగ్గాడు అని నెట్టింట ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే, తమిళనాడులో తుపాను వల్ల భారీ వర్షాలు పడుతుండటం వల్ల తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు సిద్దార్థ్ ప్రకటించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తామని చెప్పిన ఆయన ఎప్పుడు అనేది తెలుపలేదు. మిస్ యూ సినిమా ఇక వచ్చే ఏడాది రావాల్సి ఉంటుందని నెట్టింట గట్టిగానే వినిపిస్తుంది.
పుష్ప సినిమాతో పోటీ.. హైదరాబాద్‌లో సిద్ధార్థ్ ఏమన్నారంటే..?
మిస్ యూ సినిమా నవంబర్ 29న విడుదలైతే ఆ తర్వాత వారం రోజుల్లోనే పుష్ప-2 రిలీజవుతోంది.. ఈ ఎఫెక్ట్ మీ చిత్రంపై ఉంటుంది కదా..? మీరేందుకు డేర్ చేస్తున్నారని మీడియా వారు ప్రశ్నించారు. దీనిపై సిద్ధార్థ్ ఇలా స్పందించారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ..' ఇక్కడ నా కంట్రోల్‌లో ఉన్నదాని గురించే నేను మాట్లాడతా. ప్రతి సినిమా పెద్ద సినిమానే. ఎంత ఖర్చు పెట్టారనేది సినిమా స్థాయి నిర్ణయించదు. మీరు చెప్పింది కూడా కరెక్టే. రెండోవారం కూడా ఆడాలంటే ముందు నా సినిమా బాగుండాలి..ప్రేక్షకులకు నచ్చాలి. అప్పుడే నా మూవీ థియేటర్లో ఆడుతుంది. తర్వాత వేరే సినిమా గురించి వాళ్లు ఆలోచించాలి. వాళ్లు భయపడాలి.
అంతేకానీ ఒక మంచి సినిమాను థియేటర్లో నుంచి ఎవరూ తీయలేరు. ఈ రోజుల్లో చేయడం అస్సలు కుదరదు. ఎందుకంటే ఇది 2006 కాదు.. ఇప్పుడున్నంత సోషల్ మీడియా అవేర్‌నెస్ అప్పట్లో లేదు. సో మంచి సినిమాను ఎవరూ థియేటర్ నుంచి తీయలేరు కూడా' అని అన్నారు. ఇప్పుడు మిస్ యూ సినిమా వాయిదా పడటంతో సిద్ధార్థ్ వ్యాఖ్యలను కొందరు ట్రోల్ చేస్తున్నారు. చెన్నైలో కూడా డిసెంబర్ 5 తర్వాత మిస్ యూ చిత్రానికి థియేటర్స్ దొరకకపోవడంతోనే సిద్ధార్థ్ టీమ్ ఈ నిర్ణయం తీసుకుందని నెట్టింట వైరల్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment