చాలా ఎమోషనల్‌గా సాగిన సిద్ధార్థ్‌ 'చిన్నా' ట్రైలర్‌ | Siddharth Chinna Official Trailer Released | Sakshi
Sakshi News home page

Chinna Trailer: చాలా ఎమోషనల్‌గా సాగిన సిద్ధార్థ్‌ 'చిన్నా' ట్రైలర్‌

Published Sun, Oct 1 2023 11:56 AM | Last Updated on Sun, Oct 1 2023 12:05 PM

Siddharth Chinna Official Trailer Released - Sakshi

సిద్ధార్థ్‌ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘చిన్నా’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా తమిళనాట సెప్టెంబర్‌ 28న విడుదలైంది. కోలీవుడ్‌లో 'చిత్త' పేరుతో విడుదలైన ఈ సినిమా తెలుగులో అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కడ తొలి షో నుంచే మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాపై తమిళపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు భారీ ఎత్తున థియేటర్లకు క్యూ కడుతున్నారు. అంతేకాకుండా విమర్శకులు సైతం ఈ సినిమాపై పాజిటివ్‌ రివ్యూలు ఇస్తున్నారు. ఒకరకంగా సిద్ధార్థ్ కెరీర్ లోనే అద్భుతమైన సినిమాగా వారందరూ చెప్పుకొస్తున్నారు. తల్లిదండ్రులు అందరూ ఈ సినిమాను తప్పకుండా చూడాలని కమల్‌ హాసన్‌ తెలిపారు. ఈ సినిమా చూసిన అనంతరం చాలా ఎమోషన్‌కు గురైయానని ఆయన చెప్పారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం,వెట్రిమారన్‌తో పాటు ఉదయనిధి స్టాలిన్‌ కూడా ఈ సినిమా చూసి మేకర్స్‌ను అభినందించారు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటానని అప్పట్లో ఆ హీరోయిన్‌ ఇంటికి వెళ్లిన అజిత్‌..)

ఈ చిత్రం అక్టోబర్‌ 6న 'చిన్నా'గా తెలుగులోకి రాబోతోంది. దీనిని ఏషియన్‌ మూవీస్‌ వారు విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలగు ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. దీనిని చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. సిద్ధార్థ్ ఇప్పటి వరకు చేయని డీగ్లామర్ రోల్ కనిపించారు. ఆయనకు జోడీగా మలయాళ టాలెంటెడ్‌ నటి అయిన నిమిషా సజయన్ నటించింది.


  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement