రహస్యంగా నిశ్చితార్థం.. ఫోటోలు ఎందుకు షేర్‌ చేశానంటే: అదితి | Aditi Rao Hydari Comments On Her Engagement | Sakshi
Sakshi News home page

రహస్యంగా నిశ్చితార్థం.. ఫోటోలు ఎందుకు షేర్‌ చేశానంటే: అదితి

Published Thu, May 2 2024 4:22 PM | Last Updated on Thu, May 2 2024 4:23 PM

Aditi Rao Hydari Comments On Her Engagement

కోలీవుడ్‌లో కాబోయే బ్యూటిఫుల్‌ కపుల్స్‌ సిద్దార్థ్ -అదితి రావు హైదరీ. గత నెలలోనే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే, ఈ విషయంపై వీరిద్దరూ కూడా మొదట అధికారికంగా ప్రకటన చేయలేదు. కొన్నిరోజుల తర్వాత మీడియాకు చెప్పారు. తాజాగా దీనిపై మొదటిసారి అదితి రావు హైదరీ రియాక్ట్‌ అయింది. ఇదే క్రమంలో మీడియా వాళ్లకు ఈ విషయాన్ని  వెల్లడించడానికి గల కారణాన్ని కూడా ఆమె తెలిపింది. 

తను నటించిన  'హీరామండీ: ది డైమండ్‌ బజార్‌' వెబ్‌సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా పలు విషయాలను పంచుకుంది.తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో మార్చి 27న వీరి నిశ్చితార్థం జరిగింది. ఉంగరాలతో దిగిన ఫొటో షేర్ చేస్తూ.. 'ఆమె నాకు ఎస్‌ చెప్పింది' అని సిద్ధార్థ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు.

తాజాగా ఇదే విషయంపై హైదరీ ఇలా తెలిపింది. ' అందరూ తమ జీవితంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలను చాలా ప్రత్యేకంగా ఉన్న ప్రదేశంలో చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఈ క్రమంలో అందరిలా నేను కూడా నా నిశ్చితార్థాన్ని 400 ఏళ్ల నాటి గుడిలో చేసుకున్నాను. ఈ విషయం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. 

దీనికి ప్రధాన కారణం ఆ దేవాలయంతో మా కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉండటమే.. నిశ్చితార్థం తర్వాత మా అమ్మ కోరికమేరకే ఆ‌ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాను. మా పెళ్లి విషయం గురించి తెలుసుకోవాలని చాలామంది మా అమ్మకు ఫోన్లు చేశారు. వాళ్లందరికీ ఆమె సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ నిశ్చితార్థం విషయం గురించి మీడియాకు చెప్పాలని ఆమ్మే సలహా ఇచ్చింది. ఆపై తెలిసిందే. వెంటనే నేను, సిద్ధార్థ్‌ సోషల్‌మీడియాలో ఫోటోలు షేర్‌ చేశాం.' అని ఆమె చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement