
యువకుడు వెళ్లాల్సినరోజు బాగా వర్షం పడుతోంది. అందుకని పావుకోళ్లు వేసుకుని, గొడుగు పట్టుకుని ఆ గ్రామానికి వెళ్లాడు.
ఒక ఆశ్రమంలో చేరాడు ఒక యువకుడు. అక్కడ ధ్యానం గురించి ప్రత్యేకంగా బోధిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కేవలం ధ్యానం చేయించడమే శిక్షణ. ప్రతి శిష్యుడు గురువులకు శుశ్రూష చేస్తూ సాధన చేస్తాడు. ధ్యానం అంటే కేవలం ఒక అలౌకిక స్థితి మాత్రమే కాదనీ, భౌతిక జీవితం పట్ల పూర్తి స్వీయస్పృహ కలిగివుండటం కూడా ధ్యానమేననీ ఆ యువకుడికి చెప్పారు. యువకుడు పూర్తిగా నిమగ్నమైపోయాడు. అలా సాధనలో పదేళ్లు గడిచాయి. అతడు శిష్యరికం వదిలి గురువుగా పదోన్నతి పొందే రోజు వచ్చింది. సమీప గ్రామంలో వున్న పిల్లలకు ధ్యానపాఠం చెప్పడానికి పెద్ద గురువు పిలిపించాడు. యువకుడు వెళ్లాల్సినరోజు బాగా వర్షం పడుతోంది. అందుకని పావుకోళ్లు వేసుకుని, గొడుగు పట్టుకుని ఆ గ్రామానికి వెళ్లాడు. తరగతి గదిలోకి వెళ్లేముందు చెప్పుల్నీ గొడుగునూ గోడ పక్కన వదిలి లోపలికి నడిచాడు.
పెద్ద గురువు చిరునవ్వుతో పలకరిస్తూ– ‘ఇప్పుడు లోపలికి వచ్చావు కదా! నీ గొడుగును నీ పావుకోళ్లకు ఎడమవైపు నిలిపావా? కుడివైపా?’ అని ప్రశ్నించాడు గురువు. యువకుడు తత్తరపడ్డాడు. అతడి దగ్గర తక్షణం సమాధానం లేదు. ప్రతిక్షణం ధ్యానంలో ఉండటం తనకు ఇంకా అలవడలేదని గ్రహించాడు. మరింత సాధన కోసం మరో ఆరేళ్లపాటు మళ్లీ శిష్యుడిగానే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment