
ఉపాధ్యాయులకు ధ్యానంపై శిక్షణ
చేగుంట: స్థానిక పాఠశాలల ఇంగ్లిష్ మీడియం ఉపాధ్యాయులకు బుధవారం మెడిటేషన్ (ధ్యానం)పై శిక్షణ కల్పించారు. హైదరాబాద్ విపశ్యన ధ్యాన కేంద్రానికి చెందిన టీపీ రెడ్డి, మార్కండేయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు ఎక్కువ సమయం బోధించడంతో అలసటకు గురవుతారని, వారికి మానసిక ప్రశాంతత అవసరమని చెప్పారు.
అదేవిధంగా విద్యార్థులకు సైతం కొంత మానసిక ప్రశాంతత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ గంగాబాయి, సీఆర్పీలు సాయి, సయ్యాజీ, ఆర్పీ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.