
ప్రచండ వాయువు మేఘాలను ఛిన్నాభిన్నం చేసినట్టు పావనమైనటువంటి భగవన్నామం మనోమాలిన్యాలను తొలగించి వేస్తుంది. క్రమం తప్పక ధ్యానం చేయండి. అలా చేస్తూ ఉంటే మనస్సు నిశ్చలమై ఒక స్థాయికి చేరి, ఇక ధ్యానం చేయకుండా ఉండలేని స్థితికి వస్తారు.
జపం ఒక సాధన. ప్రయత్నించి అభ్యసించాలి. మీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల్లో తప్పులు వెతకడం మానండి. మీలోనే తప్పులెంచి సరిదిద్దుకోండి. ఎందుకంటే, ఎవ్వరూ పరాయివారు కాదు. ప్రపంచమంతా మనదే.
Comments
Please login to add a commentAdd a comment