టీనేజ్ అమ్మాయిల నుంచి నడి వయసు స్త్రీల వరకు.. ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను పెంపొందిస్తూ, అధికబరువును నియంత్రించేలా చేస్తుంది బద్ధకోణాసనం. ఈ యోగా భంగిమలో సీతాకోక చిలుక రెక్కల్లా మన కాలి కదలికలు ఉంటాయి. కాబట్టి బటర్‌ఫ్లై ఆసనంగా కూడా దీనికి పేరు. ఉదయం లేదా సాయంత్రం రోజూ పది నిమిషాలు ఈ బటర్‌ఫ్లై ఆసనాన్ని సాధన చేస్తే మెరుగైన ప్రయోజనాలను పొందుతారు.
కంప్యూటర్‌తో పని చేసేవాళ్లు వెన్ను, మెడ, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు సులువైన, తేలికైన సీతాకోక చిలుక ఆసనం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు.
20 నుంచి 30 సార్లు..
ముందుగా నేల మీద సుఖాసనంలో కూర్చోవాలి. రెండు పాదాలను మధ్యలోకి తీసుకొచ్చి, చేతులతో కాళ్ల వేళ్లను పట్టుకోవాలి. ఈ భంగిమలో కళ్లు మూసుకొని, శ్వాసపై దృష్టి కేంద్రీకరిస్తూ ఐదుసార్లు దీర్ఘశ్వాస తీసుకుంటూ, వదలాలి. తర్వాత కళ్లు తెరిచి, కాళ్లను మెల్లగా పైకి, కిందకు 20 నుంచి 30 సార్లు కదుపుతూ ఉండాలి.
రోజూ ఉదయం ఇలా చేస్తుంటే వెన్నెముక దృఢంగా అవుతుంది. లోయర్ హిప్స్, బ్యాక్ కండరాల బలం పెరుగుతుంది. ΄÷ట్ట కండరాలలోనూ మార్పులు వస్తాయి. ఒత్తిడి తగ్గి మైండ్, బాడీ విశ్రాంతి పొందుతాయి. కాళ్ల ఎముకల సామర్థ్యం పెరుగుతుంది. రక్తసరఫరా మెరుగై వెన్ను, మెడ, తలనొప్పి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.
– జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్
Comments
Please login to add a commentAdd a comment